ఆంధ్రప్రదేశ్

కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంపై సీఎం

సీఎం జగన్ స్పందన కార్యక్రమంపై మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ వేగవంతంపై దిశానిర్దేశం చేయనున్నారు. అలానే రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఖరీఫ్ సన్నద్ధత, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల అందుబాటుపై సమీక్ష చేపట్టనున్నారు.

గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌, అర్బన్ హెల్త్ క్లినిక్‌లు.. బీఎంయూల నిర్మాణ ప్రగతిపై సీఎం జగన్‌ సమీక్షించనున్నారు. ఇళ్ల నిర్మాణం, పట్టాల పంపిణీపై దిశానిర్దేశం చేయడంతో పాటు.. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీల తీరును సమీక్షించనున్నారు.