ఆంధ్రప్రదేశ్

జిల్లా స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఆకస్మిక చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ)

బద్వేలు: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ) ఆర్.పి. సిసోడియా  వైఎస్ఆర్ జిల్లా స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నమయ్య జిల్లాలో పర్యటన ముగించుకుని.. విజయవాడ వెళుతూ.. మార్గమధ్యంలో కడపలోని స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ జిల్లా  కార్యాలయంలో జిల్లాకు సంబంధించిన పలు రకాల రిజిస్టర్ ఫైళ్లను కలెక్టర్, జేసీ లతో కలిసి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ) ఆర్.పి. సిసోడియా క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా సమస్యలు రాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వర్తించాలాని జిల్లా రిజిస్ట్రార్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ జిల్లా అధికారి పివిఎన్ బాబు, అర్బన్ శాఖ సబ్ రిజిస్ట్రార్లు వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవిలు పాల్గొన్నారు.అంతకుముందు కడప కలెక్టర్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ) ఆర్.పి. సిసోడియాకు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ అదితి సింగ్ లు పూల మొక్కను అందించే అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ తో కలిసి.. జిల్లాలో పరిస్థిలను అడిగి తెలుసుకున్నారు. ఛాంబర్ లో వారితోపాటు జేసీ అదితి సింగ్, డిఆర్వో గంగాధర్ గౌడ్ లు వున్నారు.