ఆంధ్రప్రదేశ్ జాతీయం

సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

న్యూ ఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సెక్రటేరియట్ నుంచి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. చంద్రబాబు శనివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ భేటీలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ప్రధానంగా పోలవరం అంశం,. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు.