హైదరాబాద్ధ: రణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ విషయంలో రైతులు నానా ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటివేమి ఉండకూడదని భావించిన రేవంత్.. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ధరణి సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ధరణిపై పలు అంశాలపై సీఎం రేవంత్ సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వివరించారు. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలని సూచించారు. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.ధరణిపై కీలకంగా చర్చించిన ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, సునీల్, సీఎస్ ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించారు.
Related Articles
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ.10,25,621 ఆదాయం
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,25,621 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 1,05,146, రూ.100 దర్శనంతో రూ. 50,000, నిత్య కైంకర్యాలతో రూ.5,200, సుప్రభాతం ద్వారా రూ. 1,100, క్యారీ బ్యాగులతో రూ. 6,000, సత్య నారాయణ స్వామి […]
నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. దాదాపు ఆరు నెలల తర్వాత సమావేశాలు జరుగుతుండడంతో అధికార, విపక్షాలు దృష్టి సారించాయి.తొలిరోజు ప్రశ్నోత్తరాలు ఉండవు. సంతాప తీర్మానాల అనంతరం శాసనసభ వాయిదా పడుతుంది. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, […]
ప్రతి పేదవాడి కడుపు నింపడమే కేసీఆర్ లక్ష్యం
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email 90.5 శాతం మంది ప్రజలకు రేషన్ బియ్యం అందుతోందన్న మంత్రి హరీశ్ రావు మంత్రి హరీశ్ రావు గజ్వేల్ లోని మహతీ ఆడిటోరియంలో కొత్త రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తాము నూతనంగా 3,09,083 రేషన్ కార్డులను […]