ఆంధ్రప్రదేశ్

అక్రమంగా తరలిస్తున్న 300 కేజీల గంజాయి పట్టివేత

పరవాడ: లంకెలపాలెం నుండి అనకాపల్లి వెళ్లే మార్గ మధ్యలో తాడి మూడు మొదాలు దగ్గలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కారు ఉండడంతో స్థానికంగా ఉన్న ప్రజలు పరవాడ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు స్పందించి తాడి మూడు మొదాలు దగ్గర తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉన్న టిఎస్08 జెఎచ్ 9984 నెంబర్ గల కారునీ అదుపులోకి తీసుకొని చెక్ చెయ్యగా కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి బస్తాలు కనిపించడంతో అవి కూడా అధిక మొత్తములో  ఉండడంతో పోలీసులు ఒక్క సారిగా షాక్ తిన్నారు. అందులో 150 బస్తాలు సుమారు 300 కేజీలు గంజాయి ఉండడంతో హైదరాబాద్ చెందిన సంతోషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. మరో వ్యక్తి పరారయ్యాడు.పట్టుబడ్డ గంజాయిని సిజ్ చేసి నిందుతులు పై కేసు ఫైల్ చేసి విచారణ మొదలుపెట్టినట్టులు పరవాడ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ మల్లీశ్వరరావు తెలిపారు.