శ్రీనగర్, జూలై 27: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్సుం ప్రాంతంలో ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో ఐదుగురు చిన్నారులు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపడుతున్నాయి. మృతుల్లో ఓ పోలీస్ కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అనంత్‌నాగ్ జిల్లాలోని దక్సుంలో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పిందని, నేరుగా లోయలో పడిపోయిందని ప్రాథమికంగా తేల్చారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే అందరూ చనిపోయారు. అంతకు ముందు కూడా దొడ జిల్లాలో ఈ తరహా ప్రమాదమే జరిగింది. ఓ బస్ లోయలో పడిపోయిన ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు.
Related Articles
దేశవ్యాప్తంగా కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఇండియాలో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా 26,579 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 181 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా […]
జగన్ కు బిగ్ షాక్.. తిరుమల లడ్డు వివాదంపై కేంద్రం హోంశాఖకు ఫిర్యాదు..?
తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం దేశంలో కాకుండా ప్రపంచదేశాలలో…
Venkaiah Naidu : అన్నదాతల అభివృద్ధితోనే దేశాభివృద్ధి : వెంకయ్యనాయుడు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email అన్నదాతల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ముందు వరుస పోరాట యోధులతో సమానంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రైతులు చేసిన కృషి మరచిపోలేనిదన్నారు. రైతుల దృష్టిలో వ్యవసాయం అంటే వృత్తి కాదని, సేద్యాన్నే తమ జీవితంగా […]