తెలంగాణ

తెలంగాణ ఉద్యోగుల సంఘం,  హెచ్ఎండిఏ ఆధ్వర్యంలోఘనంగా బంగారు మైసమ్మ బోనాల సంభరాలు  

హైద్రాబాద్ జులై 27: హెచ్ఎండిఏ ప్రధాన కార్యలయం స్వర్ణజయంతి కాంప్లెక్స్ లో  హెచ్ఎండిఏ ఉద్యోగుల సంఘము తెలంగాణ ఉద్యోగుల సంఘం సంయుక్త  ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. హెచ్ఎండిఏ తెలంగాణ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు, తెలంగాణ ఉద్యోగుల సంఘము కేంద్ర సంఘం ప్రతినిధులు ఉత్సవాలలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ముఖ్య అతిదిగా  పాల్గొన్న తెలంగాణ ఉద్యోగుల సంఘము హనరబుల్  చైర్మన్   పద్మాచారి మాట్లాడుతూ  హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు రావడంలో హెచ్ఎండిఏ తెలంగాణ ఉద్యోగుల పాత్ర పోషిస్తున్నది. దీనిలో తెలంగాణ ఉద్యోగుల ఉద్యోగుల కృషి చాలా ఉన్నతమైనది.ప్రస్తుతం అన్ని ప్రపంచంలో, భారత దేశంలో హైదరాబాద్ నకు ఒక ప్రముఖ మైన స్థానాన్ని మౌలిక వసతులు కల్పనాలో, ఫ్లైఓవర్, మెట్రో రైలు, అండర్ పాస్ వేలు నిర్మాణం, భూసేకరణ చేసి  ఆధునికరించి ప్రజల కు అందుబాటులో తీసుకొని రావడంలో, రింగ్ రోడ్, RRR అనుసంధానం చేసుకుంటూ, P. V. NR ఎక్సప్రెస్ వే ఏర్పాటు చేసి ప్రజలకు విమానాశ్రయం తో అనుసంధానం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం మరియు భావి తరాలకు అనుగుణంగా ఔటర్ హైదరాబాద్ తీర్చి దిద్దడం లో ముఖ్యపాత్ర పోషిస్తున్నది. అన్ని విభాగాలలో మాదిరిగానే హెచ్ఎండిఏ లో కూడా సరైన రిక్రూట్మెంట్ లేని కారణంగా ఉద్యోగుల కొరత ఏర్పడింది.ప్రభుత్వం వెంటనే రిక్రూట్మెంట్ జరిపి ఉద్యోగ ఖళీలను భర్తీచేయాలి అని అన్నారు.అనుభవం కలిగి రిటైర్ అయిన ఉద్యోగుల సేవలను హెచ్ఎండిఏ ఉపయోగించుకోవాలన్నారు హెచ్ఎండిఏ పరిదిలో /వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడే అన్ని వెంచర్లలో హెచ్ఎండిఏ ఉద్యోగులకు తెలంగాణ ఇంటిస్థలాలు అల్లాట్ చేసి రిటైర్మెంట్ లోపు స్వంత ఇళ్ళు కట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని  పద్మాచారి  కోరారు.  బంగారుమైసమ్మ దీవెనలు అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ హెచ్ఎండిఏ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ ఉద్యోగుల సంఘము రాష్ట్ర అధ్యక్షలు శ్రీ మఠం రవీంద్ర కుమార్ గారు మాట్లాడుతూ హెచ్ఎండిఏ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అని, తెలంగాణ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యగులు వారి కుటుంబసభ్యులు అందరికీ శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ ఆలయాన్ని నిర్మాణం జరుపుకొని బోనాల కార్యక్రంలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని   అందరికి ఆరోగ్యం,  అశ్వర్యం కలిగించాలని రవీంద్ర కుమార్  ప్రార్థిస్తున్నట్లు తెలియ చేసారు. ఈ కార్యక్రమం లో శ్రీ జైకిషన్  భావన్స్ కాలేజీ ఛైర్మన్  ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు.సచివాలయం ఉద్యోగుల సంఘము చైర్మన్ G. శ్రీనివాస్ రెడ్డి,   జనార్దన్ రెడ్డి RDO,  P. కృష్ణా రావు ఉపాధ్యక్షులు, సురేందర్  G. మహేష్ కుమార్ IPM,వరప్రసాద్, కృష్ణమూర్తి, గోపాల్ రావు,  కుమారస్వామి, శ్రీనివాస్, విజయకుమార్, మరియు అధికారులు మరియు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు