ఆంధ్రప్రదేశ్

సుంకలమ్మ అమ్మను దర్శించుకున్న మంత్రి సత్య కుమార్

అనంతపురం: అనంతపురం జిల్లా, గుత్తి మండలం, బాచుపల్లి గ్రామంలోని బాట సుంకలమ్మ అమ్మ వారిని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ దర్శించుకున్నారు.  ముందుగా ఆలయ అర్చకులు మంత్రి సత్య కుమార్ ను స్వాగతం పలికారు.  మంత్రి సత్య కుమార్ కుటుంభ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. తరువాత గుత్తి పట్టణంలోని అనంత టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి మాట్లాడుతూ వైసీపీ అరాచకాలు చూడలేక ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపారని, ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటామని సత్య కుమార్ అన్నారు. కూటమి విజయంతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని అన్నారు.