మేడ్చల్: వెళ్తుండగా బాలికకు ఫిట్స్ వచ్చి బ్రెయిన్ డెడ్ అయింది. చికిత్స చేయించినా పలితం లేకుండా పోయింది. బాలిక బతుకుతుందనే వైద్యులు భరోసా ఇవ్వ లేదు. బాలిక తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంతో బాలిక అవయవాలు దానం చేసి మరో పదిమందికి ప్రాణం పోశారు. మేడ్చల్ పట్టణానికి చెందిన కూర శ్రీనివాస్, సరిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. రెండో కూతురు కూర దీపిక(16) నగరంలోని ఓ కళాశా లలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల22న ఇంటి నుంచి బయలుదేరే సమ యంలో వాంతులతో ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలింది. నగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్చించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అవయవాలు స్పందించడం లేదని వెంటిలేటర్ పై వైద్యం అందించారు. బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు తేల్చారు. ఆ తల్లి దండ్రులకు వచ్చిన ఆలోచనతో ఆసుపత్రి వర్గాలతో సంప్రదించి బాలిక అవయ వాలు దానం చేసేందుకు నిర్ణయించారు. ఈనెల 25న బాలిక మృతి చెందడంతో బాలిక అవయవాలతో పది మందికి ప్రాణం పోశారు. ఇదే విషయం పై మేడ్చల్ పట్టణంలోని సోషల్ మీడియా వేదికగా బాలిక తల్లిదండ్రులను అభినందిస్తున్నారు.
Related Articles
కొత్తగా ఏం చేయొచ్చో పాలుపోవట్లేదు: విజయసాయిరెడ్డి
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email బీజేపీ అధికారంలోకి వస్తే రూ.75లకే చీప్ లిక్కర్, ఇంకా కుదిరితే రూ.50లకే ఇస్తాం అని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. చౌకబాబు ప్రకటనలు గుప్పిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ”జగన్ గారి సంక్షేమ పథకాలతో ప్రజలు వేరే పార్టీలను ఆదరించే […]
కేటీఆర్ పుట్టిన రోజు..మొక్కలు నాటిన స్పీకర్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email నేడు మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తున్న ముక్కోటి వృక్షార్చనలో తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో వీరు మొక్కలు నాటారు. పోచారం […]
లక్ష్యం సాధించే వరకు ఉక్రెయిన్‌లో సైనిక చర్య కొనసాగుతుందిః పుతిన్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫార్ ఈస్టర్న్ పోర్ట్ సిటీ వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతు..ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని రక్షించడమే ప్రధాన లక్ష్యమన్నారు. లక్ష్యం సాధించే వరకు ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగుతుందని పుతిన్ స్పష్టం చేశారు. ఆంక్షల […]