తిరుపతి: భాకరాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసారు. డబ్బు కోసమే బాధితుడి కిడ్నాప్ చేసారు. నిందితులనుంచి నకిలీ పిస్టల్, మత్తుమందు ఇంజక్షన్లు, రెనాల్ట్ ట్రైబెర్ వాహనం స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు అన్నారు. తిరుపతి జిల్లా, చిన్నగొట్టిగల్లు మండలము, చెరువుముందరపల్లి గ్రామానికి చెందిన జంగం భాస్కర్ ను ఈ నెల 24 వ తేదిన ఉదయం భాకరాపేట ఘాట్ రోడ్డు లో పెట్రోల్ బంకు సమీపములో తన ఆటో లో వెళుతుండగా కిడ్నాపర్లు నకిలీ తుపాకిని చూపి కిడ్నాప్ చేశారు. గొడవ చేస్తాడనే భయముతో అతనికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేసి, అక్కడక్కడ కారులో తిప్పారన్నారు.
బాధితుడు వద్ద నున్న ఫోనుతో తన కుమారుడు రెడ్డి కిరణ్ కు ఫోను చేసి మొదట 5 కోట్ల రూపాయిలు డిమాండ్ చేశారు. అంత మొత్తం కుదరక పోవడంతో ఒకటిన్నర కోటి రూపాయిలను ఇవ్వాలని, లేదంటే జంగం భాస్కర్ ను చంపుతామని బెదిరించినారు. బాధిదితుడి కుమారుడు రెడ్డి కిరణ్ సదరు విషయమును భాకరాపేట పోలీసులకు పిర్యాదు చేశాడు. చంద్రగిరి డిఎస్పి నరసింగప్ప ఆధ్వర్యంలో ఎస్బి, భాకరాపేట, తిరుచానూరు, సైబర్ సెల్ సిఐ ల ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం భాకరాపేట ఘాట్ రోడ్డులోని ఊర్జా హోటల్ వద్ద కిడ్నాపర్లను గుర్తించగా, కిడ్నాపర్లు కారులో తప్పించుకునే ప్రయత్నంలో పోలీస్ వాహనాన్ని కూడా డీ కొట్టడం జరిగింది. అయినా పోలీసు వారు చాకచక్యంగా చుట్టుముట్టి నలుగురు కిడ్నాపర్లను పట్టుకున్నారు. , మరో ఇద్దరు ఇర్ఫాన్, అంజి లు పారిపోయారు. పట్టుబడిన నిందితులపై గతములో బెంగుళూరు, రొంపిచెర్ల, భాకరాపేట, రాయచోటి లలో దొంగతనం మరియు ఎర్రచందనం కేసులు నమోదయ్యాయి.