అంతర్జాతీయం జాతీయం ముఖ్యాంశాలు

ఓటీపీతో వ్యాక్సినేషన్‌ స్టేటస్‌

  • కొవిన్‌లో కొత్త సదుపాయం

కేంద్ర ఆరోగ్య శాఖ కొవిన్‌ పోర్టల్‌లో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక వ్యక్తి కరోనా వ్యాక్సిన్‌ వేయించుకొన్నారా లేదా అనేది ఆ వ్యక్తి రిజిస్టర్డ్‌ ఫోన్‌ నంబర్‌, పేరుతో సర్వీస్‌ ప్రొవైడర్లు తెలుసుకోవచ్చు. అయితే ముందుగా ఆ వ్యక్తి సమ్మతి అవసరం. దాని కోసం ఆ వ్యక్తి సెల్‌ ఫోన్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని సర్వీస్‌ ప్రొవైడర్లు తెలుసుకొని ‘వ్యాక్సినేషన్‌ స్టేటస్‌’ను నిర్ధారించుకోవచ్చు. ట్రావెల్‌ ఏజెన్సీలు, కార్యాలయాలు, యాజమాన్యాలు, ఐఆర్‌సీటీసీ వంటి ప్రభుత్వ సంస్థలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ ప్రతి గానీ డిజిటల్‌ రూపంలో గానీ లేని పౌరులకు ఈ సదుపాయం ఉపయోగపడుతుందని కేంద్రం పేర్కొంది.