గ్రామ శివారులో కాపుకాసి నరికి చంపిన ప్రత్యర్థులు
కడప జిల్లా లింగాల మండలం కోమనూతలలో వైస్సార్సీపీ కి చెందిన సర్పంచ్ మునెప్ప (50) శిక్షణ తరగతులకు హాజరై బైక్పై వస్తున్న సమయంలో ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. గ్రామ శివారులో ఆయనను అడ్డుకున్న ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఆధిపత్య పోరే ఈ హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మునెప్ప 150 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.