రంగారెడ్డి, జూలై 30: పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావాహులలో జోష్ పెరిగింది. సర్పంచుల పదవీకాలం పూర్తై ఆరు నెలలు అవుతుండగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ల పదవీకాలం ఈనెల ఐదున ముగిసిన విషయం తెలిసిందే, పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్ణయిస్తామని ఆగస్టు మొదటి వారంలోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.దీంతో పల్లెల్లో ఎన్నికల సందడి ఏర్పడింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావహులు ఇప్పటికే ప్రజలను, ఆయా గ్రామాలలో మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. చిన్న శంకరంపేట మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఉన్నాయి గతంలో ఉన్న రిజర్వేషన్ మారుతి ఎవరు? మారకపోతే ఎవరు? పోటీచేయాలని దీనిపై గ్రామాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.ఒక్కొక్క పార్టీ నుండి ముగ్గురు లేదా నలుగురు ఆశావహులు పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలతో పాటు ఆరు గ్యారెంటీల పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ సైతం ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకుని పంచాయతీలో గెలవాలని చూస్తోంది అనే సమాచారం. అలాగే మెదక్ ఎంపీ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గెలవడంతో బీజేపీ పార్టీకి చెందిన యువత కూడా ఈ పంచాయతీ ఎన్నికల్లో నిలబడి గెలవాలని రెండు మూడు రోజుల క్రితం మండలం లో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి చర్చించినట్లు తెలిసింది. తాజా, మాజీలు కొత్త వ్యక్తులు సర్పంచ్ కొరకు పోటీ చేసేందుకు నిమగ్నమై ఉన్నారు. స్థానిక సంస్థలు ప్రభుత్వం ఉన్న రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది ముఖ్యంగా బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచడం కోసం బీసీ జన గణన చేస్తామని ప్రకటించింది ప్రస్తుతం రిజర్వేషన్లు పరిశీలిస్తే పదిహేను శాతం ఎస్సీలకు ఆరు శాతం ఎస్టీలకు 24 శాతం బీసీ రిజర్వేషన్లను ఇప్పటికే అమలై ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఓసారి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలి.ఈ క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఆ పంచాయతీలకు కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయి.ఆరు నెలల నుంచి పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో పంచాయతీలకు కావలసిన నిధులు ఆగిపోయాయి. దీంతో గ్రామపంచాయతీలో ప్రజలకు కల్పించాల్సిన సదుపాయాలకు కావలసిన నిధులు రాకపోవడంతో పాలన కుంటుపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఆగస్టు మొదటి వారం లోపు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని, అదికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో, గ్రామాలలోని పంచాయతీ ఎన్నికలు త్వరలో రానున్నట్లు తెలుసుకున్న ఆశావహులు గ్రామాలలో ఎన్నికల సందడి నెలకొంది.
Related Articles
తెలంగాణలో ధాన్యం కొనుగోలు ఫై కేంద్రం కీలక ప్రకటన..
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email తెలంగాణ ధాన్యం కొనుగోలు ఫై గత కొద్దీ రోజులుగా రాష్ట్ర సర్కార్ కు బిజెపి కి మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనూ ఈ వార్ కొనసాగుతుంది. ఈ తరుణంలో పార్లమెంట్ లో ధాన్యం కొనుగోలు ఫై కేంద్రం కీలక […]
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email సెన్సెక్స్ 1,047 పాయింట్లు లాభపడి 57,864 , నిఫ్టీ 312 పాయింట్లు పెరిగి 17,287 దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ఇవాళ ఉన్న సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును మరింత బలపరిచాయి. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,047 పాయింట్లు లాభపడి […]
వియ్యంకుడికి బిల్లులు, సొంత క్రషర్ కోసమే సంజయ్ జంపు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email జగిత్యాలతో బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గోన్నారు.కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది. ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ హాయాంలోని కాంగ్రెస్ పార్టీ. 2004 లో […]