ఆంధ్రప్రదేశ్

శ్రీవల్లి దేవసేనకు కురగాయాల అలంకారం

అవనిగడ్డ: ఆషాడ కృత్తిక సందర్భంగా మోపిదేవి లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం అందంగా ముస్తాబైయింది. ఆషాడ కృత్తిక సందర్భంగా స్వామివారిని అమ్మవార్లను వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఆషాడ మాసం కృత్తిక నక్షత్రం స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ చక్రధర్ రావు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు  ఆలయ అర్చకులు. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు.