తెలంగాణ

రెండు లారీలు ఢీ… ఒక డ్రైవర్ మృతి

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ శివారులో జాతీయ రహదారి పై ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు బీర్ లోడ్ తో వెళ్తున్న లారిని వెనక నుండి  ఉల్లిగడ్డ లోడ్ లారీ ఢీకొట్టింది.  లారీ ముందు భాగం పూర్తిగా డామేజ్ అయింది.లారీ కాబిన్లో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు ఇరుకున్న డ్రైవర్ మృత దేహాన్ని పోలీసులు బయటకు తీసారు.  తెల్లవారు జామున నిద్ర కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించిన పోలోసులు ట్రాఫిక్ ను క్లియర్ చెశారు.