ఆంధ్రప్రదేశ్

ఉరకుంద ఈరన్న స్వామి ఆలయం దర్శించుకున్న జిల్లా ఎస్పీ  జి బిందు మాధవ్భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పగడ్బందీగా చేపట్టాలిజిల్లా ఎస్పీ బిందు మాధవ్ 

కౌతాళం: కౌతాళం మండలం పరిధిలో గ్రామం నందు   దైవ క్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాసం  ఉత్సవాలకు వచ్చే భక్తులకు సదుపాయాలు ఏ కల్పించాలని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ  అధికారులు ఆదేశించారు.ఈ సందర్భంగా మంగళవారం జిల్లా ఎస్పీ  కౌతాళం మండలం ఉరుకుందకు చేరుకున్నారు,భద్రత ఏర్పాట్లను పరిశీలించారుఉరుకుంద ఈరన్న స్వామి వారిని దర్శించుకుని జిల్లా ఎస్పీ  ప్రత్యేక అర్చకులు నిర్వహించారు
ఉరుకుంద శ్రీ నరసింహ ఈరన్న స్వామి శ్రావణమాసం ఉత్సవాలు ఆగస్టు 4 తేది నుంచి ప్రారంభం కానన్నది పెద్ద  సంఖ్యలో  వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని భక్తులకు దర్శ నం క్యూ లైన్లు, భారీ కేడ్స్, పార్కింగ్ స్థలాలు, ఏర్పాటుపై పరిశీలన చేశారు ,
అనంతరం మంచినీరు స్నాన ఘట్లు ఆరోగ్య కేంద్రా తదుపరి సౌకర్యాలు ఏర్పాటుపై ఆలయం అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు,పెద్ద ఎత్తున భక్తుల కు ఈరన్న స్వామి దర్శనం కోసం వివిధ రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు  తరలివస్తుండడంతో  భక్తులకు అవసరం నిమిత్తం తగిన వసతులు కల్పించాలన్నారు ఆలయ పరిసరాల ప్రాంతంలో వస్తువులు. పూజ సామాగ్రి. టెంకాయలు అధిక ధరలు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు,
సీసీ కెమెరా పకడ్బందీగా ఏర్పాటు చేస్తూ పర్యవేక్షణ కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల సమాచార, సహాయం  పిర్యాదుల కోసం ఓ నెంబర్ కేటాయించాలని ఆల సిబ్బందిని,  ఉత్సవం ప్రారంభమయ్యే నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని  సంబంధిత శాఖల అధికారులు సమాన్వయకంతో పని చేయాలన్నారు. ఈ  ఆదోని డిఎస్పీ శివ నారాయణ స్వామి, ఆలయ ఈవో వెంకటేశ్వర్లు , స్పెషల్ బ్రాంచ్ సిఐ నాగరాజు యాదవ్, కోసిగి సీఐ ప్రసాద్, కౌతాళం ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి, మరియు రెవిన్యూ  శాఖ అధికారులు, మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.