తెలంగాణ

వేములవాడ ప్రభుత్వ కార్యాలయాలలో భారీగా సెస్ బకాయి విద్యుత్ బిల్లులు

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో, బకాయి బిల్లులు కట్టని ఆఫీసులకు కోతలు విధిస్తున్నారు. పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కరెంటు బకాయి బిల్లులు భారీగా పేరుకుపోవడంతో నోటీసులు ఇచ్చారు. బకాయి బిల్లులు చెల్లించకపోతే ఆయా శాఖల కార్యాలయాల్లో కరెంటు కనెక్షన్ తొలగిస్తున్నారు. వేములవాడ బల్దియాలో(మున్సిపల్) కరెంటు బకాయి బిల్లు 3 కోట్ల 24 లక్షల 14 వేలు. ఏరియా ఆసుపత్రిలో 13 లక్షల 19 వేల 601రూపాయి. పాత సివిల్ ఆసుపత్రిలో మూడు లక్షల ఒక వెయ్యి 450 రూపాయలు. ఎంపీడీవో కార్యాలయంలో 52,వేల 51 రూపాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 2 లక్షల 53 వేల 94 రూపాయలు. రూరల్ తాసిల్దార్ కార్యాలయంలో 3 లక్షల 55 వేల 950 రూపాయలు బకాయిలు పేరుకుపోయినట్లు పట్టణ సెస్ ఏఈ సిద్ధార్థ  తెలిపారు. బకాయి బిల్లులు చెల్లించి,  సెస్ అధికారులకు సహకరించాలని కోరారు…