తెలంగాణ

ఎల్ఎల్సీ కాలువకు గండి

నల్గోండ: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల జరిగి ఎల్ఎల్సీ వరద కాల్వ”కు గండిపడింది. అనుముల మండలం, మారెపల్లి వద్ద వరద కాల్వకు భారీ గండి పడింది. దాంతో నీటి పారుదల శాఖ అధికారులు నీటి విడుదలను  నిలిపివేసారు. ఈనెల 2తేదిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి నీటిని విడుదల చేశారు.
వరద కాలువ మెయింటినెన్స్ గాలికి వదిలేయడంతో.. కంపచెట్లు, పిచ్చి మొక్కలు పెద్ద ఎత్తున పెరిగాయి.  -కాలువ నుంచి నీరెళ్ళే దారి లేకపోవడంతో కాలువకు  గండి పండింది.