తెలంగాణ

యాదాద్రిలో లక్ష పుష్పార్చన

యాదాద్రి: ఆషాడ మాసం ఏకాదశి పునస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లక్ష్య పుష్పార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వివిధ రకాల పుష్పాలతో లక్ష్మీనరసింహస్వామికి ఏకాదశి పూజలు నిర్వహించారు వేదమంత్రోచనం మంగళ వాయిద్యాలతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఆలయంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు  వెంకటాచార్యులు మాట్లాడుతూ ప్రతి నెలలో జరిగే ఏకాదశి రోజున స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.