నర్సీపట్నం: రావణాపల్లి జలాశయాన్ని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు బుధవారం సందర్శించారు. అయ్యన్న మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేయకపోవడం వల్ల గట్లు శిథిలావస్థకు చేరాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కాపాడారు. ఎనిమిది సంవత్సరాల క్రితం వీటి మరమ్మత్తులు చేసాము అప్పటినుంచి పట్టించుకునే నాధుడు లేడు. కోటి 80 లక్షలు ఎన్ టి పి సి వారిచ్చిన నిధులతో ప్రొటెక్షన్ వాల్ నిర్మించాము. అది నిర్మాణంలో ఉండగా ప్రభుత్వం మారడంతో అర్ధాంతరంగా నిర్మాణాన్ని ఆపేశారు. మరమ్మతులకు కావలసిన నిధులను ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి తీసుకురావడం జరుగుతుంది.కలెక్టర్ తో కూడా మాట్లాడి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 వేల ఎకరాలకు నీరు అందిస్తామని అన్నారు.
Related Articles
పచ్చి మోసగాడు చంద్రబాబు
తిరువూరులో నన్ను రౌడీ ముఖలతో కొట్టించాలని లోకేష్ అనుకున్న…
చంద్రబాబుకు ముందస్తు బెయిల్
అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చే…
10, 9, 6… ఇది ఏపీ ఎంపీలపై సర్వే…
ఏపీలో ఎన్నికల మూడ్ నెలకొంది. ఫిబ్రవరిలో ఎన్నికల …