తెలంగాణ

విష జ్వరాలతో విలవిలలాడుతున్న భీంపల్లి గ్రామస్తులు

హన్మకొండ: కమలాపూర్ మండలంలోని భీంపల్లీనీ నెలరోజులుగా  జ్వరాలు వణికిస్తున్నాయి. విషజ్వరాలతో గ్రామ ప్రజలుమంచెమెక్కారు. అంతు చిక్కని ఆరోగ్య సమస్యలతో  ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వారం రోజులకు జ్వరం తగ్గిన తర్వాత కాళ్లు వాపులు, ముఖం నల్లగా అవ్వడం లాంటి సమస్యలు వస్తున్నాయి. గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో అనారోగ్యం బారిన పడిన జిల్లా అధికారులు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్థుల ఆవేదన. తాగునీటి కలుషితం అయ్యిందా…? పర్యావరణ సమస్య ఉందా…? దోమలతో జ్వరాలు వస్తున్నాయా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు  గ్రామస్థులు.  ప్రభుత్వం, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని జ్వరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని  భింపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.