జాతీయం తెలంగాణ ముఖ్యాంశాలు

ఇప్పటివరకు లభించని తేజ శ్రీ ఆచూకీ

అయోధ్య: అయోధ్య సరయూ నదిలో  జనగామకు చెందిన బాలిక గల్లంతు అయిన విషయం తెలిసిందే. బుధవారం వరకు ఆమె ఆచూకీ లభించలేదు. ఈనెల 28న అయోధ్య రామ మందిరం దర్శనానికి  జనగామ పట్టణానికి చెందిన తాళ్లపల్లి నాగరాజు కుటుంబం వెళ్లింది. 29వ తేదీన సరయూ నదిలో స్నానాలు చేస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతు అయ్యారు. వారిలో నలుగురిని స్థానికులు సురక్షితంగా కాపాడారు. తేజశ్రీ అనే బాలిక ఆచూకీ గల్లంతుఅయింది. బాలిక ఆచూకీ లభ్యం కాకపోవడంతో రెండు రోజులుగా అక్కడి రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపడుతోంది. తేజశ్రీ జనగామ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుంది. సహాయక చర్యలు అందించి తగుచర్యలు తీసుకోవాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి బండి సంజయ్ లేఖ రాసారు. దైవ దర్శనం విషాదంగా మారడంతో కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.