ఆంధ్రప్రదేశ్

హుస్సేన్ పురంలో పెన్షన్ కార్యక్రమం

కాకినాడ: కాకినాడ జిల్లా హుస్సేన్ పురం గ్రామంలో   ఎన్టీఆర్ భరోసా   పెన్షన్ కార్యక్రమం గ్రామంలో పండగ వాతావరణం లో జరిగింది.  ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బందితోపాటు తెలుగుదేశం , జనసేన నాయకులు , కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు  ఎన్నికల టైం లో మాటిచ్చిన ప్రకారం 3000 పెన్షన్ 4000  చేసి ఇస్తున్నారని గ్రామ ప్రజలకు పెన్షన్ దారులకు చెప్పడం జరిగింది.  ఈ కార్యక్రమంలో  తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చల్లా బుజ్జి,  కోట అప్పారావు ,  చల్లా వెంకటరమణ  , పుప్పాల సాయి ,పలివేల చంద్రశేఖర్ , గుడాల గణేష్ ,కాకరపల్లి లోవరాజు ,తలారి శ్రీనివాసరావు , నొక్కు రమణ ,బుంగ బాలరాజు పంచాయతీ సెక్రెటరీ కర్రీ శ్రీనివాసరావు ,  వెల్ఫేర్ ఆఫీసర్ వింజమూరు ఆచార్య , గ్రామ పెద్దలు ,యూత్ సభ్యులు పాల్గొన్నారు.