తెలంగాణ

కాంగ్రెస్ లోనే ఎమ్మెల్యే బండ్ల

హైదరాబాద్: గద్వాల్ ఎమ్మెల్యే . బండ్ల. కృష్ణ మోహన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఎక్సైజ్ మంత్రి  జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ. జి. మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.పాత పరిచయాల నేపథ్యంలో అసెంబ్లీ లాబీలో బిఆర్ఎస్ నాయకులను కృష్ణమోహన్ రెడ్డి  కలిశారు తప్ప బిఆర్ఎస్ పార్టీలో చేరలేదని పేర్కొన్నారు, మీడియాలో వదంతులు తప్ప కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడి వెళ్లలేదని, కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని తెలిపారు.