తెలంగాణ ముఖ్యాంశాలు

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న భారీ వరద

నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు వ‌ర‌ద కొన‌సాగుతోంది. శ్రీశైలం నుంచి కృష్ణ‌మ్మ ప‌ర‌వ‌ళ్లు తొక్కుతూ.. సాగ‌ర్‌లో ప్ర‌వేశిస్తోంది. నాగార్జున సాగ‌ర్ జ‌లాశ‌యం ఇన్ ప్లో 2,77,640 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 29,82 క్యూసెక్కులుగా ఉంది. జ‌లాశ‌యం గ‌రిష్ఠ నీటిమ‌ట్టం 590 అడుగులు, ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 553.10 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్టు గ‌రిష్ఠ నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా, ప్ర‌స్తుత నీటి నిల్వ 216.43 టీఎంసీలు.