హైదరాబాద్, ఆగస్టు 2: హైదరాబాద్ రాయదుర్గంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. BNR హిల్స్ నుండి వేగంగా వచ్చిన కారు మార్కం చెరువు దగ్గర ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరణ్ అనే యువకుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. మృతుడు ICFAI యూనివర్సిటీ లో BBA చదువుతున్న విద్యార్థి చరణ్‌గా గుర్తించారు. మెహదీపట్నంలోని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కారు పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. స్టీరింగ్, టైర్లు ఊడి పడ్డాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. పోలీసులు రెండుగంటలపాటు శ్రమించి కారు నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Related Articles
సీఎం కేసీఆర్‌ను కలిసిన నార్ముల్ డెయిరీ పాలకవర్గం
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email నల్లగొండ – రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్) నూతన పాలకవర్గం గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసింది. డెయిరీ చైర్మన్‌గా ఎన్నికైన గంగుల కృష్ణారెడ్డితో పాటు డైరెక్టర్లు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కలువగా.. కార్యవర్గాన్ని […]
తెలంగాణలో మిస్సింగ్ పాలిటిక్స్
తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణు కొత్త పు…
వేగంగా వరినాట్లు
తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న తుఫాను…