missing-revanth
తెలంగాణ రాజకీయం

తెలంగాణలో మిస్సింగ్ పాలిటిక్స్

తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వానలు, వరదలు వచ్చినా ప్రజల్ని పట్టించుకోవడం లేదని ఒకరిపై ఒకరు వాంటెడ్ పోస్టర్లు ఊరంతా అతికిస్తున్నారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో మొదట పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లపై ఎవరి పేరూ లేదు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు వాటిని వైరల్ చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ మిస్సింగ్.. 2020 వరదలు వచ్చినప్పుడు రాలేదు.. 2023లో వారం నుంచి వర్షాలు కురుస్తున్న రాలేదు.. మల్కాజ్‌గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కనబడుటం లేదని నియోజకవర్గంలో పోస్టలర్లు వెలువడటం హాట్ టాపిక్ గా మారింది.

హైదరాబాద్ నగరంలో వరదలకు ప్రతి కుటుంబానికి 10వేలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిరసనలు చేస్తుంటే.. అసలు ఒక ఎంపీగా ఎప్పుడు అయినా నియోజవర్గానికి వచ్చారా..? అంటూ మల్కాజ్‌గిరి అంతటా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ పోస్టర్లు పెట్టడం ఆసక్తిగా మారింది.రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు.. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే, రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఉంటూ నియోజవర్గానికి రాకపోవడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు.

అయితే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విపక్షాలు విమర్శలు మాని ప్రజలకు సహాయం చెయ్యాలని కౌంటర్ ఇవ్వడం.. ఆ వెంటనే పోస్టర్లు వెలవడం పట్ల బిఆర్ఎస్ హస్తమే అయి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా మా నాయకుడు కనపడటం లేదు.. అనే పోస్టర్లు వెలువడటం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపింగ్ గా మారింది.