తెలంగాణ

ఒంటరి మహిళ దారుణ హత్య

నల్గొండ: నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెళ్ళెంల గ్రామంలో దారుణం  జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న రెబ్బ జానకమ్మ అనే మహిళను హత్య చేసారు. హత్య అనంతరం ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం,రూ లక్ష నగదు ఎత్తుకెళ్లారు. నిందితుడు అదే గ్రామానికి చెందిన వాడిగా అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టారు.