పెద్దపల్లి: మాదిగల ఉనికిని చాటిన సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని మాదిగ శక్తి అధ్యక్షుడు బొంకూరి సురేందర్ అన్నారు. శనివారం ఆయన మాజీ మంత్రి వర్యులు మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
సుప్రీమ్ కోర్టు ధర్మాసనానికి యావత్తు మాదిగ జాతి తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు.
మాదిగలకు ఏ రాజీయపార్టీ చేయలేని పని సుప్రీం కోర్టు చేసిందన్నారు. ముప్ఫై యేండ్ల కల సాకారం అయిన వేళ, సుదీర్ఘంగా జరిగిన వర్గీకరణ సామాజిక ఉద్యమాలతో ఒక పక్క కృష్ణ మదిగ కృషి పట్టుదల మరోప్రక్క, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో వర్గీకరణకు మద్దతు గా మాజీ మంత్రి వర్యులు మోత్కుపల్లి నర్సింహులు చూపిన తెగువ గొప్పదన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కేసును నడిపించిన తీరు, చంద్ర బాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి గా ఎబిసిడి వర్గీకరణకు చేయడం ఇవన్నీ కూడా ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పు నకు దోహద పడ్డాయన్నారు . సుప్రీమ్ కోర్టు తీర్పు వల్ల ఎన్నో సంవత్సరాలుగా ఆర్ధికంగా,సామాజికంగా,రాజకీయంగా, విద్య, ఉద్యోగ రంగాల్లో వెనకబడిన మాదిగ, మాదిగ ఉప కులాల ప్రజలు అభివృద్ది బాటలో నడిచేందుకు ఈ తీర్పు దోహద పడుతుందన్నారు. అసెంబ్లీలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సుప్రీమ్ కోర్టు తీర్పును గౌరవిస్తూ మాదిగల పక్షాన మాట్లాడిన ప్రతి మాట కట్టుబడి ఉండాలని వారికి మాదిగల పక్షాన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నామని సురేందర్ మాదిగ అన్నారు.