సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. బదిలీపై వెళ్లిన ఓ రిజిస్ట్రార్ చివరి రోజు 350కి పైగా రిజిస్ట్రేషన్లు చేసినట్టు ఏసీబీ గుర్తించింది. కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూముల్ని కూడా రిజిస్ట్రేషన్ చేసినట్టు సమాచారం. ఏసీబీ అధికారుల్ని చూసి కిటికీలోంచి డబ్బులు పడేసిన వ్యక్తిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించే పనిలో ఏసీబీ అధికారులు వున్నారు. జిల్లా ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి అధికారులు వచ్చారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని హార్డ్ డిస్క్ లు, 64 డాక్యుమెంట్లని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఏసీబీ దాడుల నేపథ్యంలో శుక్రవారం కేవలం 13 రిజిస్ట్రేషన్ లే కావడం గమనార్హం.