ఆంధ్రప్రదేశ్

జనసేన కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే నిమ్మక

విజయవాడ: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో  ప్రజల సమస్యలు తెలుసుకొని వినతులు స్వీకరించే కార్యక్రమంలో సోమవారం పాలకొండ ఎమ్మెల్యే  నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. సమస్యలు పరిశీలించి సంబంధిత శాఖలకి సమాచారం అందించే ప్రక్రియ ప్రారంభించారు. కొన్ని సమస్యలను అధికారులకి ఫోన్ ద్వారా తెలిపారు.