తెలంగాణ

చెల్లెలు బెయిల్ కోసం ఢిల్లీలో కేటీఆర్

హైదరాబాద్: చెల్లెలు కవిత కు బెయిల్ కోసం కేటీఆర్ ఢిల్లీ  గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. తీహార్ జైలులో చెల్లెలు ములాఖత్ కోసం ఢిల్లీ వెళ్లి పెద్ద పెద్ద మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కవితను బయటకు తీసుకురావడానికి న్యాయకోవిదులతో చర్చిస్తున్నామని  కేటీఆర్, హరీష్ రావు చెప్తే బాగుండేది. పార్టీ ఫిరాయింపులపైన సుప్రీంకోర్టుకు వెళ్తాం, న్యాయనిపుణులతో చర్చిస్తామని బీఆర్ఎస్ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పదేళ్లలో సుప్రీం కోర్టు ఒకటి ఉందని గుర్తు  ఉందా మీకు . బీఆర్ఎస్ హయాంలో స్పీకర్లు   ఫిరాయింపులపై ఎందుకు నోరు మెదపలేదు..?  పదేళ్లలో 60 మంది కి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లను చేర్చుకొని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి మీరు కాదా..? వేములవాడ నుంచి భారత పౌరుడు కాని వ్యక్తి ని ఎమ్మెల్యే చేసిన మీరా రాజ్యాంగం గురించి మాట్లాడేది.. భారత పౌరుడు కాదని కోర్టు స్పష్టంగా చెప్పినా బీజేపీ తో కుమ్మక్కై ధర్మాన్ని తొక్కపెట్టలేదా..?  అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను దూరం పెట్టిన విషయం మరిచిపోయారా..? లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను జీరో చేసిన విషయం మరిచిపోయారా. రెండు నెలల క్రితం జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన విషయం మరిచిపోయారా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు అండగా ఉన్నారు. ఢిల్లీకి మీతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలు అసలు మీ పార్టీలో ఉంటారా. కేటీఆర్, హరీష్ రావు ఎన్ని ప్రయత్నాలు చేసినా  ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండరు. మూడు  అసెంబ్లీ సమావేశాలకు రాని ప్రతిపక్ష నాయకుడి పైన  బీఆర్ఎస్  నాయకుల్లో విశ్వాసం పోయిందని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లను చేర్చుకున్నప్పుడు న్యాయకోవిదులు కనిపించలేదా. ఉప ఎన్నికలని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.. ఏ ఎన్నికలు వచ్చినా  ప్రజలు  సరైన సమాధానం చెబుతారు. రుణమాఫీ చేశాం.. ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం.. ప్రజలు మాతోనే ఉన్నారు. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చింది బీఆర్ఎస్ హయాంలోనే. కుటుంబ సభ్యుల బెయిల్ కోసం ఢిల్లీలో చక్కర్లు కొట్టుకోండి కాని రాజ్యాంగం కోసమని చెప్పకండని అన్నారు.