తెలంగాణ

తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొ. జయశంకర్‌ జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

జగిత్యాల: జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి, స్వరాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్  అని , వారి సేవలు చిరస్మరణీయమని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి , సత్య ప్రసాద్ అన్నారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం  తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ జయంతి ని పురస్కరించకుని ఆయన చిత్ర పటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ నే ఆశ, శ్వాసగా జీవించి ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారని కొనియాడారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పోరాడి మలి దశ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధనకు ఆచార్య జయశంకర్ మార్గదర్శనంగా నిలిచారన్నారు.ఆచార్య జయశంకర్  మన మధ్య లేనప్పటికీ.. అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వెల్లడించారు. ఆచార్యుని ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, పి రాంబాబు, (లోకల్ బాడీస్) గౌతమ్ రెడ్డి, బిసి వెల్ఫేర్ సాయిబాబా, ఎస్సీ వెల్ఫేర్ రాజు కుమార్, డీపీఓ, రఘు వరుణ్, సీపీఓ, పూర్ణచందర్ , ఆర్డిఓ శ్రీనివాస్,కలెక్టరేట్ పరిపాలన అధికారి హన్మంతురావ్ కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, అధికారులు,తదితరులు పాల్గొన్నారు.