ఆంధ్రప్రదేశ్

గ్రామానికి సుస్తీ

 కాకినాడ: పిఠాపురం నియోజవర్గం యు కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామానికి సుస్తీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రి వెనుక కాలనీలో  జ్వరాలు ప్రబలిపోయాయి. ప్రతి ఇంటిలో ఓ రోగి వున్నారు. వర్షపు నీరు, మురుగునీరు ఏకమై రోడ్డుపైనే కాలువలను తలపిస్తున్నాయి. టైఫాయిడ్, వైరల్ ఫీవర్ లు ,డెంగ్యూ వ్యాపిస్తున్నాయని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి పారిశుద్ద్యంన్ని మెరుగుపరచడంతో పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.