ఆంధ్రప్రదేశ్

నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్రిక్తత

నెల్లూరు: నెల్లూరు కార్పోరేషన్ కార్యాలయంలో గురువారం ఉద్రిక్తత నెలకింది. కార్పొరేషన్ లో భవన నిర్మాణాలకు సంబంధించి ఆర్జీలను మంత్రి మంత్రి నారాయణ స్వీకరిస్తున్నారు. ఆ సమయంలో కార్పొరేటర్లు, కార్యకర్తలతో కలిసి కార్పొరేషన్ కార్యాలయానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు. ఎమ్మెల్యే లోపలికి వెళుతుండగా చెయ్యి అడ్డుపెట్టి పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఒక్కరే లోపలికి వెళ్లాలని, కార్పొరేటర్లు, కార్యకర్తలను తీసుకెళ్లద్దంటూ పోలీసులు అడ్డుకున్నారు. తనకోసం కష్టపడ్డ కార్యకర్తలను ఎందుకు లోపలికి రానివ్వరంటూ పోలీసులపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వహించారు.
కార్యకర్తలను అడ్డుకున్న  పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. తరువాత శ్రీధర్ రెడ్డి  కలుగజేసుకుని కార్యకర్తలను బయటకు పంపించారు.  దాంతో వివాదం సద్దుమణిగింది.