హైదరాబాద్, ఆగస్టు 8: ట్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీస్ ఉద్యోగం చేయాలంటే సంబరపడే రోజులు మాయమైపోయాంటున్నారు సిటీ పోలీసులు. ఇటీవల కాలంలో పెరిగిన పని ఒత్తిడితో హైదరాబాద్ కమిషనరేట్‌లో పని చేసేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల సిటీ పోలీసింగ్‌లో వచ్చిన మార్పులతో హైదరాబాద్‌లో పోస్టింగ్ అంటేనే పోలీసులు భయపడిపోతున్నారంటున్నారు. సిటీ పోలీసింగ్ అంటే సవాళ్లతో సహవాసంగా మారుతుండమే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపడం లేదని చెబుతున్నారు. శాంతిభద్రతల నిర్వహణతో పాటు కేసుల దర్యాప్తు, గస్తీ విధులు, ప్రముఖుల పర్యటనల్లో బందోబస్తు, సమస్యాత్మక ప్రాంతాల్లో 24 గంటలూ డ్యూటీలు చేయాల్సి రావడంతో సిటీ పోలీసులపై పని ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. దీనికి తగ్గట్టు సిబ్బందిని పెంచకపోవడం, పని చేసిన వారిని టార్గెట్ చేస్తూ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో చాలామంది పోలీసులు సిటీలో విధులంటేనే జంకుతున్నారని చెబుతున్నారు.ఒకప్పుడు హైదరాబాద్‌లో విధులంటే పోలీసులు పోటాపోటీగా ముందుకు వచ్చే వారని చెబుతున్నారు. సిటీలో పోస్టింగ్ కోసం ఎన్నో పైరవీలు చేసేవారు. కోరుకున్న పోస్టింగ్‌లకు కాసులు కూడా సమర్పించుకునే వారు. కానీ, ప్రస్తుతం పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చిందంటున్నారు. కోరుకున్న చోట పోస్టింగ్ ఇస్తామంటున్నా… ఎస్‌ఐలు, సీఐలు మాకొద్దు బాబోయ్ అంటూ దండం పెట్టేస్తున్నారట.. ముఖ్యంగా గత మూడేళ్ల నుంచి ఈ పరిస్థితి ఏర్పడిందంటున్నారు. సిబ్బంది సామర్థ్యం, స్థితిగతులను పట్టించుకోకుండా 24 గంటలూ అందుబాటులో ఉండాలంటూ ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో చాలా మంది పోలీసులు మానసికంగా కుంగిపోతున్నారని చెబుతున్నారు.నగరంలో ఏడు జోన్లు ఉండగా, కొన్నిచోట్ల తీవ్ర పని ఒత్తిడి ఉంటోందంటున్నారు. ముఖ్యంగా సెంట్రల్, వెస్ట్, సౌత్ జోన్లలో స్టేషన్ హౌస్ అఫీసర్ నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. క్షణం కూడా ఖాళీ లేకుండా 24 గంటలూ డ్యూటీలు చేయాల్సి వస్తోందని ఆయా ఏరియాల్లో పని చేస్తున్న పోలీసులు వాపోతున్నారు. ఎప్పుడు… ఎక్కడ.. డ్యూటీ వేస్తారో తెలియక తీవ్రంగా సతమతమవుతున్నారని చెబుతున్నారు. వెస్ట్ జోన్‌లో వీఐపీ మూమెంట్ ఎక్కువగా ఉండడంతో ప్రతి చిన్న విషయాన్ని పైస్థాయి అధికారులు భూతద్దంలో పెట్టి చూస్తున్నారని చెబుతున్నారు. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, డైలీ క్రైమ్ రిపోర్ట్, పెండింగ్ కేసులపై సమీక్షలు అంటూ ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచుతుండటం వల్ల క్షేత్రస్థాయి సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక… బాధలు అనుభవించలేక చాలా మంది సిబ్బంది నరకం చూస్తున్నామని చెబుతున్నారు.పని భారం పెరగడం, ఉన్నతాధికారుల ఒత్తిడికి తోడుగా అత్యవసర పరిస్థితుల్లోనూ సెలవు దొరకని పరిస్థితుల్లో హైదరాబాద్ కమిషనరేట్‌లో ఉద్యోగమంటే భయపడే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. సిటీలో ఉద్యోగం హాయిగా ఉంటుందని ఏరికోరి మరీ పోస్టింగ్ తెచ్చుకుంటే.. తమ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారిందని కొందరు పోలీసులు ఆవేదన చెందుతున్నారు. స్టేట్‌లో హైదరాబాద్ మినహా ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా వెళ్లిపోతామని తమకు తెలిసిన అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రాధేయపడుతున్నారని చెబుతున్నారు.సిటీలో ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలను అందించేందుకు మెగా సిటీ పోలీసింగ్ అమల్లోకి తీసుకొచ్చిన నుంచి పరిస్థితి మరింత ఘోరంగా తయారైందంటున్నారు. గత ఏడాది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐదు జోన్లను ఏడుకు విస్తరించారు.. 11 ఏసీపీ డివిజన్లు, 11 కొత్త స్టేషన్లు అందుబాటులోకి తెచ్చారు.. శాంతిభద్రతలు, మహిళా పోలీస్ స్టేషన్లతో కలిసి నగరంలో మొత్తం 78 పోలీసు స్టేషన్లు ఉండగా, అందుకు తగ్గట్టు సిబ్బంది సంఖ్య పెరగలేదు. దీంతో పని ఒత్తిడి ఎక్కువైపోయిందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పని చేయలేమని భావిస్తూ సిటీలోని కీలకమైన స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు దీర్ఘకాలిక సెలవుకు ప్రయత్నిస్తుండటం పోలీసుశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు నగరంలోని పోలీసులు అనుభవిస్తున్న ఒత్తిడికి నిదర్శనమని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే పోలీసుశాఖపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.
Related Articles
కులవృత్తి లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కులు
ఈరోజు మేడ్చల్ కలెక్టరేట్ ఆఫీస్ లో కులవృత్తి లబ్ధిదారులకు…
అమిత్ షాపై కేసు.. రాజాసింగ్ ఫైర్
లంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పొలిటికల్ హీట్ నెలకొంటోంది. ఓవైపు రాజకీయ పార్టీల నేతల విమర్శలు, ప్రతి విమర్శలు.. మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ ప్రధాన నేతలపై ఈసీకి ఫిర్యాదులతో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతు…
కాంగ్రెస్, బిఆర్ఎస్ ల డిఎన్ఎ ఒక్కటే...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర…