శ్రీకాకుళం, ఆగస్టు 13: వారం రోజులుగా నడుస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీలో రచ్చకు ఫుల్ స్టాప్ పడుతుందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఫైనల్‌గా ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ సభ్యుల చర్చలు ముగిసాయి. రెండు గంటల పాటు చర్చించిన దువ్వాడ బంధువులు.. 5 డిమాండ్లను దువ్వాడ సోదరుడితో చెప్పారు వాణి బంధువులు. ఆస్తుల పంపకం, విడాకులపై సుదీర్ఘంగా చర్చించారు ఇరువర్గాలు. పిల్లలను దృష్టిలో పెట్టుకొని విడాకులు వద్దని నచ్చచెప్పారు వాణి కుటుంబసభ్యులు. తాము జరిపిన చర్చలు సఫలం అవుతాయని.. ఈరోజుతో ఈవివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని వాణి బంధువులు భావిస్తున్నారు. చర్చలు విషయం పక్కన పెడితే.. ఇంత జరిగాక తన అన్న విడాకులకే సిద్ధమయ్యారని చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్. మరోసారి అన్న దువ్వాడ శ్రీనివాస్‌తో మాట్లాడాక ఫైనల్ నిర్ణయం చెబుతామన్నారు శ్రీధర్.దువ్వాడ, వాణి విషయం ఇలా ఉంటే.. యాక్సిండెట్ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాధురి మాత్రం ఎమోషనల్‌గా మాట్లాడారు. హాస్పిటల్ నుంచి వీడియో విడుదల చేశారు మాధురి. మనుషుల్లో మానవత్వం ఉందనుకున్నా.. కానీ మోసం ఉంటుందని తెలుసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు మాధురి.అయితే ఫైనల్‌గా వాణి, దువ్వాడ శ్రీను మధ్య ఎపిసోడ్ చర్చల్లో ఆర్ధిక పరమైన సమస్యలే చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వాణి పెట్టిన 5 డిమాండ్స్ పై దువ్వాడ శ్రీను ఏవిధంగా స్పందిస్తారు? ఆయన సోదరుడు ఒప్పిస్తాడా? అని దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ గొడవకు వాణి డిమాండ్స్ తో ఫుల్ స్టాప్ పడుతుందా? లేక దువ్వాడ ఏమైనా డిమాండ్స్ పెడతాడా? అనే ఉత్కంఠ రేపుతోంది.
Related Articles
పోలవరంపై వైసీపీ రాజకీయాలు
ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఏపీ విషయంలో క…
ఉద్యోగుల పట్ల ఎందుకంత క్రూరత్వం : జగన్ కు లోకేశ్ లేఖ
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ టీచర్లు, ఉద్యోగులను అరెస్టు చేయడం, నిర్బంధించడం పట్ల ఏపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ మండిపడ్డారు. దీనిపై సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగుల పట్ల ఎందుకంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారని నిలదీశారు. వారికి న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల కోసం […]
పోరాడుతున్న కొడాలి నాని
ఏపీలో హాట్ నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. ఎన్టీఆర్ సొంత…