ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల బదిలీ షురూ...

విజయవాడ, ఆగస్టు 15: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ముహుర్తం ఖరారైంది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. నెలాఖరులోగా ఉద్యోగులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ శాఖల్లోఉద్యోగులను బదిలీ చేయాలని స్పష్టం చేసింది. ఉద్యోగుల బదిలీ నేపథ్యంలో రెవిన్యూ సదస్సుల నిర్వహణ కూడా వాయిదా పడింది.ఏపీలో ప్రభుత్వ శాఖల ప్రక్షాళనకు ఉద్యోగుల బదిలీ తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పాతుకుపోయిన సిబ్బంది కారణంగా క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తుతున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రహిత సేవల్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అన్ని ప్రభుత్వ శాఖల్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. బదిలీలకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసి ఉత్తర్వులను బుధవారం విడుదల చేయనున్నారు.ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బది లీకి ముహుర్తం సిద్ధమైంది. ఆగస్ట్‌ నెలాఖరులోగా అన్ని శాఖల్లో బదిలీలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం అన్ని జిల్లాల్లో నిర్వహించ తలపెట్టిన రెవెన్యూ సదస్సుల్ని కూడా సెప్టెంబరు మొదటి వారానికి వాయిదా వేశారు.ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన తేదీలు, మార్గదర్శకా లపై బుధవారం జీఓ గెలువడుతుంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై తరగతులు మొదలు కావడంతో కొన్ని ఎంపిక చేసిన ప్రభుత్వ విభాగాల్లోనే బదిలీలు ఉంటాయి.ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగులు, గ్రామ, వార్డు సచి వాలయాలు తదితర విభాగాల ఉద్యోగుల్ని బదిలీ చేస్తారు.ఉపాధ్యాయులు, వైద్యుల వంటి రోజువారీ పాలనా వ్యవహారాలతో సంబంధం లేని విభాగాల ఉద్యోగులకు ఈ ఏడాది బదిలీలు ఉండవు. 2024 జులై 31కి ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల్ని తప్పనిసరిగా బదిలీ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో నిర్ణయించారు. ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తికాని ఉద్యోగులను పరిపాలనా పరమైన అవసరాలు, అనారోగ్య కారణాలు, స్పౌస్‌ కేస్, వ్యక్తిగత విజ్ఞప్తుల మేరకు బదిలీ చేస్తారు.ఉద్యోగి పనిచేసే చోట ఎప్పటి నుంచి పనిచేస్తున్నారన్నది లెక్కించేందుకు, వివిధ కేడర్లలో అక్కడ పనిచేసిన మొత్తం కాలాన్ని పరిగణనలోకి తీసు కుంటారు. వేర్వేరు హోదాల్లో ఒకే చోట పనిచేసిన కాలాన్ని మొత్తంగా పరిగణిస్తారు.అంధులు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు మించి పనిచే స్తున్నవారు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు, మానసిక వైకల్యమున్న పిల్లలు కలిగినవారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగి భార్య/ భర్త, పిల్లలు, తల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యంతో బాధపడు తుంటే, వారికి వైద్య సదుపాయం అవసరమైన ప్రాంతా లకు బదిలీ చేసేందుకు ప్రాధాన్యమిస్తారు.వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు- రిజిస్ట్రేషన్లు, రవాణా, వ్యవ సాయశాఖ వంటి ప్రత్యేక నిర్వహణ వ్యవస్థలు కలిగిన విభాగాల్లో ఉమ్మడి మార్గదర్శకాలతో పాటు వారి విభా గాల పనితీరును అనుసరించి సొంతంగా మార్గదర్శకాలు రూపొందించుకునే వెసులుబాటు ఇవ్వాలని నిర్ణయించారు.