ఆంధ్రప్రదేశ్

 ట్రాక్టర్ ట్రాలీ మీద పడి రైతు మృతి

అనంతపురం:  అనంతపురం జిల్లా, గుత్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది.  మండల పరిధిలోని తొండపాడు గ్రామంలో ట్రాక్టర్ ట్రాలీ ప్రమాదవశాత్తు మీద పడి సుంకన్న అనే రైతు మృతి చెందాడు.  ఉదయమే పంట పొలం వద్ద గడ్డి తీసుకోవడానికి ట్రాక్టర్ ట్రాలీ తో వెళ్ళాడు.   అయితే ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ కిందకు రాకుండా హైడ్రాలిక్ స్టక్ అయింది.   దీంతో ట్రాలీ కింద కూర్చున్న హైడ్రాలిక్ మిషన్ ను మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ ట్రాలీ రైతు సుంకన్న మీద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా… అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.