GO-85
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

జీ.వో.85 రద్దు చేయాలని నల్ల బ్యాడ్జీలతో సి.బెళగల్ మండల వైద్యుల నిరసన

ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల జీవో 85కి వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ, నిన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గొల్లపూడి కి అధికారిక నోటీసులు ఈ జీవోను అన్యాయంగా పరిగణించి ఈ రోజు నుండి సి.బెళగల్ మండలంలోని ప్రాథమిక కేంద్రాల్లో పనిచేసే వైద్యులు  నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఈ జీవో ద్వారా, తమ మూడేళ్ల సర్వీసు కు అర్థం లేకుండా పోయిందని ఇలా అకస్మాత్తుగా జీవోను మార్చడం అన్యాయమని తమ వృత్తి ప్రగతికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, గత రెండు నెలలుగా జీవో 85 రద్దు చేయమని అన్ని శాఖల అధికారులకు, శాసనసభ్యులకు అర్జీలు సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి సమాధానం రాలేదని వైద్యులు నిరాశ వ్యక్తం చేశారు. కోవిడ్ 19 సమయంలో మా జీవితాలను ప్రమాదంలో పెట్టి సేవలు అందించినప్పటికీ, ఇప్పుడు జీవో 85 ద్వారా పీజీ అవకాశాలు తగ్గించడం అన్యాయమని, ఇది ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలను ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఈరోజు విధులు నిర్వహిస్తూ, నిరసనగా వైద్యులు నల్లబ్యాడ్జలను ధరించారు.

అలాగే నేడు,రేపు సేవలకు అంతరాయం లేకుండా నిరసన కొనసాగుతుందని, ఈ రెండు రోజులు ప్రభుత్వ చర్చల కోసం ఎదురు చూస్తామని తెలిపారు. శుక్రవారం రోజు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించనిచో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు అత్యవసర సర్వీసులను మినహాయించి అన్ని రిపోర్టింగ్ లు, వీడియో కాన్ఫరెన్స్ లు, టెలికాన్ఫరెన్స్ లు అధికారిక కమ్యూనికేషన్లు నిలిపివేస్తామన్నారు.అలాగే శనివారం రోజు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు కేవలం అత్యవసర సేవలు మాత్రమే వైద్యం అందిస్తామని, ఆదివారం (15.09.2024) చలో విజయవాడ ర్యాలీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద జరుగుతుందని,(16.09.2024) సోమవారం జీవో 85 రద్దు వరకు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభమవుతుందని తెలిపారు.

ఇంతకాలం నిరసనలు, అర్జీలు ఇచ్చిన ప్రభుత్వం స్పందించకపోవడంతో, విడుదలైన నీట్ పీజీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ తర్వాత వైద్యులు ఇలానే కొనసాగడం సాధ్యం కాక, ఆందోళనకు దిగవలసిన పరిస్థితి వచ్చిందని, వెంటనే జీవో 85ను రద్దుచేసి వైద్యుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి.బెళగల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు డాక్టర్ హరిశ్చంద్రుడు, మిథున్ కుమార్ రెడ్డి, సునీత, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.