- క్యాబినెట్ నిర్ణయాన్ని స్వాగతించిన ఓసీ జేఏసీ
- ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
హుజూరాబాద్, ఆగస్టు 1: విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఓసీ జేఏసీ నాయకులు సంబురాల్లో మునిగిపోయారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చారు. స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఓసీ జేఏసీ నాయకులు గందె రాధిక, ఎడవెల్లి కొండల్‌రెడ్డి, కౌరు సుగుణాకర్‌రెడ్డి, తాటిపెల్లి రాజన్న, పోరెడ్డి శంతన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అవకాశాలు పెరుగుతాయి
విద్య, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలుచేయాలని ప్రభుత్వానికి నాలుగు రోజుల కిందట వినతిపత్రం సమర్పించాం. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదించడం సంతోషకరం. ఈ నిర్ణయంతో ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు పెరుగుతాయి. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు.
- పొలాడి రామారావు, ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు
గత పాలకులుపట్టించుకోలే
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పూర్తిస్థాయి అమలుతో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు పెరుగుతాయి. గత పాలకులు ఓసీల అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. అర్హులైన వారు ఓసీ రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలి.
- పాడి విజయ్‌పాల్‌రెడ్డి, గ్రీన్‌సెడ్జ్ పాఠశాల కరస్పాండెంట్, హుజూరాబాద్
రైతు బాంధవుడు కేసీఆర్
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతినని మరోసారి రుజువు చేశారు. రూ.50 వేలలోపు రైతుల రుణాలను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ రైతాంగం తరఫున ధన్యవాదాలు. కరోనా కష్టకాలంలోనూ ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విష యం. సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ రైతు బాంధవుడే. రాష్ట్రంలో సాగు పండుగైంది. రైతులు సంతోషంగా ఉన్నారు.
- పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు