తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లడ్డూల్లో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు, కూరగాయలు నూనె కలిసిందని ప్రకటించారు. ఆయన చెప్పిన నిమిషాల వ్యవధిలో రాష్ట్ర కాదు దేశం కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆ వార్త దావానలంలా మార్చేసింది. ఆ నెయ్యికి సంబంధించిన వివరాలు సైతం టీటీడీ ఈవో శ్యామల రావు స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్రం దిన్డుగల్ కి చెందిన ఏ ఆర్ డైరీ పూడ్ ప్రైవేట్ లిమిటెడ్ నెయ్యి 10 ట్యాంకులు వచ్చింది.. అందులో 6 ట్యాంకులు నెయ్యి బాగుంది. నాణ్యత లేని మరో 4 నెయ్యి ట్యాంకులను పరీక్షలు కోసం నమూనాలు తొలి సారి టీటీడీ నుంచి బయట ల్యాబ్ కు పంపి పరీక్షలు చేయించారు.అయితే, ఆ పరీక్షల్లో నెయ్యి కల్తీ గా మారిందని.. సాధారణంగా ఉండాల్సిన విలువల కన్నా వేరుగా నివేదికల ద్వారా తేలింది. అందులోను వివిధ కూరగాయలు నూనెలు, చేప నూనె, జంతువుల కొవ్వు ఉందని నిర్ధారణ అయిందని టీటీడీ ప్రకటించింది. అయితే ఈవో ఫిర్యాదు మేరకు తమిళనాడులోని డైరీ పై కూడా అక్కడి అధికారులు తనిఖీలు జరిగాయి. దీంతో ఆ సంస్థ ప్రతినిథులు సైతం మాట్లాడారు.
తమకు సంబంధం లేదని.. తాము మంచి నెయ్యి పంపామని.. ఎక్కడైనా పరీక్షలు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరిగినా దానికి కారణం టీటీడీ వద్ద ల్యాబ్ లేదని కాంట్రాక్టర్లు ఇలా నాసిరకం పంపారని ఈవో అంటున్నారు. టీటీడీది తప్పు లేదు.. డైరీ వాళ్లది తప్పు లేదు మరీ ఎవరిది తప్పు.. ఎవరిది బాధ్యత..? అసలు కల్తీ జరిగిందా లేదా అనేది పెరుమాళ్లకెరుక అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.టీటీడీ టెండర్ విధానం ద్వారా వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేస్తుంది. వీటి అన్నింటిని టీటీడీ మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో గోడౌన్ లో ఉంచి వాటిని టీటీడీ సంస్థలకు పంపిణీ చేస్తారు. తిరుమల, టీటీడీ అనుబంధ సంస్థలు అన్నింటికి ఇస్తారు. వీటికి నిబంధనలు, సూచనలు, క్వాలిటీ పరీక్షలు చేస్తామని టీటీడీ గతంలో చెప్పారు. వాటితోనే స్వామి వారి తో పాటు ఆలయాలకు, భక్తులకు, ఉద్యోగులకు, టీటీడీ ఆసుపత్రులు, విద్యార్థులకు అందిస్తారు. అలాంటి వాటి పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఇక దాతలు, భక్తులు ఇచ్చే విరాళం ముడి సరుకుల పరిస్థితి ఏమిటి.. దాతలు ఇచ్చే వాటికి ఎలాంటి పరీక్షలు ఉంటాయి.. నిజంగా దాతలు టీటీడీకి సరిపడే నాణ్యతతో ఇస్తున్నారా.. ఒక వేళ ఇవ్వకపోతే వాటిని ఎక్కడ.. ఎలా తనిఖీ చేస్తున్నారు. నాణ్యత సరిగ్గా లేకపోతే వాటిని ఏమి చేస్తున్నారు అనేవి ప్రస్తుతం భక్తుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలు. దీనిపై టీటీడీ కూడా సమాధానం ఇవ్వాలి.
బయిటకొస్తున్న వ్యవహారాలు
తిరుమలలో లడ్డూ వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా కల్తీ నెయ్యి కలిసిందని రిపోర్టులు బయటికి వచ్చాయి. ఆ కల్తీ నెయ్యిలో చేప నూనె, జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెలు కలిశాయన్న విషయం సంచలనంగా మారింది. గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమే కమీషన్ల కోసం నెయ్యి సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌ను మార్చారనేది ఆరోపణ. ఈ విషయంలో టీడీపీ గత ప్రభుత్వంపై చాలా ఆరోపణలు చేస్తోంది. తిరుమల లడ్డూ వ్యవహారంలోనే కాక, గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారు తిరుమలలో తమకు నచ్చినట్లుగా దోచుకున్నారని కూడా టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజాపై టీడీపీ ఆరోపణలు చేసింది.వీరిద్దరూ శ్రీవారి దర్శనం టికెట్లను అమ్ముకున్నారని తెలుగు దేశం సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేసింది. కళాధర్ ట్రావెల్స్ పేరుతో పెద్దిరెడ్డి, బుక్ మై దర్శన్ పేరుతో ఆర్కే రోజా పరోక్షంగా టీటీడీ దర్శనాల విషయంలో అందినకాడికి దండుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
కళాధర్ ట్రావెల్స్ స్కామ్: పెద్దిరెడ్డి బినామీ కళాధర్ ట్రావెల్స్. ప్రతిరోజూ టూరిజం డిపార్ట్‌మెంట్ కు 1000 దర్శనం టికెట్లు కేటాయిస్తే, అందులో 800 టికెట్లు కళాధర్ ట్రావెల్స్‌కే వెళ్లేవి. నడవాల్సింది 30 బస్సులు కాగా, నడిచినవి కేవలం 4 బస్సులే. ఈ స్కామ్‌లో ఒక్కో టికెట్‌ను రూ.5,550 కి అమ్ముకున్నారబుక్ మై దర్శన్ స్కామ్: బుక్ మై దర్శన్ కింద 75 టికెట్లను కేటాయించేవారు. ఒక్కో టికెట్ అమ్మాల్సింది రూ.1250 అయితే, అమ్ముకొన్నది మాత్రం రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య. ఈ టికెట్ల అమ్మకం కోసం రోజా టీం 20 మంది పని చేసేవారు. అయితే, ఈ దోపిడీలో తాడేపల్లి వాటా ఎంత?’’ అని టీడీపీ సోషల్ మీడియాలో ఆ ఇద్దరు మంత్రులను టార్గెట్ చేస్తూ సంచలనంగా ఆరోపణలు చేసింది.‘‘వైసీపీ హయాంలో జగన్ అండ దండలతో తిరుమల కొండపై శ్రీవారి దర్శనాలను వ్యాపారం చేశారు అప్పటి మంత్రులు పెద్దిరెడ్డి, రోజా. దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్మించి రోజుకి కోటి వరకూ దండుకున్నారు’’ అని సోషల్ మీడియాలో టీడీపీ పోస్టు చేసింది.