అంతర్జాతీయం రాజకీయం

అమెరికా, రష్యాలకు దీటుగా ఇజ్రాయిల్

ఇజ్రాయిల్ పేరు ప్రస్థావనకు రాగానే ఐరన్ డోమ్ గుర్తుకు వస్తుంది. ఇజ్రాయిల్ దేశం తనను తాను కాపాడుకోవడానికి ఏర్పరచుకున్న అత్యంత ఆధునికమైన రక్షణ వ్యవస్థ ఇది. ఒకరకంగా ఇది ఉక్కు కవచం లాగా ఆ దేశాన్ని కాపాడుతూ ఉంటుంది. దాడులను ధైర్యంగా అడ్డుకుంటుంది. ఆకాశం నుంచి క్షిపణులను ప్రయోగించినా వీసమెత్తు నష్టం వాటిల్లదు. పాలస్తీనా, హెజ్ బొల్లా, లెబనాన్ వాటి దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ తో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుంది.. అయితే ఇందులో యారో -2, యారో -3 వ్యవస్థలు బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకుంటాయి. అంతరిక్షంలోనే వాటిని పేల్చేసి.. వాటి శకలాలు కూడా దూరంగా పడేలా చేస్తాయి. ఇక ఈ రక్షణ వ్యవస్థలో డేవిడ్ స్ట్రింగ్ అనేది మిడిల్ డిఫెన్స్ సిస్టం గా పనిచేస్తుంది.. 100 నుంచి 200 కిలోమీటర్ల స్వల్పశ్రేణి బాలిష్టిక్ క్షిపణులను ఇది ఎదుర్కొంటుంది. యుద్ధ విమానాలను, డ్రోన్లను ఇది నేలమట్టం చేస్తుంది. దీనికి చిట్ట చివరిలో ఐరన్ డోమ్ అనే వ్యవస్థ ఉంటుంది. దీనిని ఇజ్రాయిల్ విస్తృతంగా వాడుతుంది. హమాస్, హెజ్ బొల్లా వేలాది రాకెట్లను ప్రయోగించగా.. ఐరన్ డోన్ పడగొట్టింది.

ఇజ్రాయిల్ దేశానికి అద్భుతమైన రక్షణ వ్యవస్థగా నిలిచింది..ఐరన్ డోమ్ ను ఇజ్రాయిల్ పరిభాషలో “కిప్పాట్ బర్జెల్” అని పిలుస్తుంటారు. ఇది స్వల్ప శ్రేణి ఆయుధాలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఇందులో రాడార్, కంట్రోల్ సెంటర్, మిసైల్ బ్యాటరీ వంటి విభాగాలు ఉంటాయి. రాడార్ అనేది దూసుకు వస్తున్న ఆయుధాలను పసిగడుతుంది. అవి నేలను తాకే స్థితిని అంచనా వేస్తుంది. అక్కడ ఒకవేళ ఎటువంటి నిర్మాణాలు లేకపోతే వదిలిపెడుతుంది. ఒకవేళ జనావాసాలు మాత్రం ఉంటే రాకెట్ ప్రయోగిస్తుంది. వెంటనే ధ్వంసం చేస్తుంది. ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఎల్టా, ఎంప్రెస్ట్ సిస్టం, రఫెల్ వంటి సంస్థలు పనిచేశాయి.. దూసుకు వచ్చే రాకెట్లను నేలమట్టం చేయడానికి ఇజ్రాయెల్ తమార్ క్షిపణులను వాడుతుంది. ఇందులో ఎలక్ట్రో ఆస్తిక్ సెన్సార్లు, మల్టిపుల్ స్టీరింగ్ ఫిన్స్ ఉంటాయి. ఇక ప్రతి ఐరన్ డోన్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు కచ్చితంగా ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 10 సెకండ్ల వ్యవధిలో పది క్షిపణులను ప్రయోగిస్తాయి. ఇంతటి వ్యవస్థ ఉంది కాబట్టే ఇజ్రాయిల్ దేశం తనను తాను కాపాడుకుంటున్నది. శత్రు దేశాల ఎత్తులను చిత్తులు చేస్తోంది.. అత్యాధునిక ఆయుధ సంపత్తిని పెంచుకొని.. డిఫెన్స్ విభాగంలో అమెరికా, రష్యా దేశాల స్థాయిలో బలమైన శక్తిగా ఎదిగింది.
ఇజ్రాయెల్ పదాతి దళాలు- ఈ ఫోర్సెస్ భూమి మీద జరిగే యుద్దాలకు వాడే దళాలు. ప్రస్తుతం గాజాలో భూతల యుద్ధం చేస్తోంది ఐడీఎఫ్ లోని ఈ గ్రౌండ్ ఫోర్సెస్.
ఇజ్రాయెల్ వైమానిక దళం – ఇజ్రాయెల్ గగనతల రక్షణతో పాటు, ఇతర శత్రు దేశాలపై గగనతల యుద్దం చేయాడానికి, గ్రౌండ్ ఫోర్సెస్ కు సాయపడటానికి ఐఏఎఫ్ పని చేస్తుంది. ప్రస్తుతం గాజాలోనూ, లెబనాన్ లోను ఐ.ఎ.ఎఫ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఇజ్రాయెల్ నౌకాదళం – ఈ విభాగం ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న సముద్రతల భద్రతను, రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది.
పై మూడు విభాగాలు  ఇజ్రాయెల్ రక్షణలో కీలకంగా పని చేస్తాయి.  ఈ దళాలు దేశ  భద్రత, రక్షణ చర్యల్లో పని చేసే ఫ్రంట్ ఫోర్సెస్ అని చెప్పాలి. ఇక వీరితో పాటు మిలిటరీ ఇంటలిజెన్స్, సైబర్ డిఫెన్స్ యూనిట్స్ వీరి రక్షణ వ్యవస్థలో కీలకంగా పని చేస్తాయి.
దేశ అంతర్గత భద్రత కోసం పని చేసే దళాలు ఇవే…
దేశం వెలుపల  యుద్దాలకు పనిచేసే ఐడీఎఫ్ అందులోని అంతర్గత దళాల పని తీరు తెలుసుకున్నాం. ఇప్పుడు దేశంలో లోపల అంతర్గత భద్రత కోసం మరి కొన్ని దళాలను ఆ దేశం ఏర్పాటు చేసుకుంది. దేశం చుట్టూ శత్రువులే ఉన్నాయి. ఇక పక్కనే పాలస్తీనా తీవ్రవాదులతో నిత్యం  అతర్గతంగా సవాళ్లు ఎదురవుతుంటాయి. ఎప్పుడైనా ఎక్కడైనా తీవ్రవాదుల బాంబులకు, ఆత్మాహుతి దాడులను ఎదుర్కోవల్సిన పరిస్థితి ఇజ్రాయెల్ దేశానిది. వీటి నుంచి ఇజ్రాయెల్ పౌరులను కాపాడటానికి వివిధ రకాల భద్రతా సంస్థళు పని చేస్తున్నాయి. ఇవి దేశ ప్రజలను, సరిహద్దులను. ప్రభుత్వ సంస్థల రక్షణే ధ్యేయంగా పని చేస్తాయి.
షిన్ బెట్ – ఈ సంస్థ ప్రధాన విధి దేశంలో అంతర్గత భద్రతను చూసుకోవడం. దేశ అంతర్గత భద్రతకు సవాల్ విసిరే తీవ్ర వాద చర్యల ఉనికిని పసిగట్టి అడ్డుకుంటుంది. దేశ అంతర్గత భద్రతకు సవాల్ విసిరే సంస్థలు, వ్యక్తుల ను గుర్తించి  సమాచారం సేకరించడం, దేశ వ్యాప్తంగా తనదైన శైలిలో గూఢాచార్యం నిర్వహించి రక్షణ చర్యలు తీసుకోవడం ప్రధాన విధులు.
మగావ్ ) – బోర్డర్ పోలీస్: ఇది మన దేశంలో బీఎస్ఎఫ్ ఎలానో అలా ఇజ్రాయేల్ దేశంలో  దేశ సరిహద్దుల్లో భద్రత ఏర్పాట్లు చూస్తుంది. దేశ సరిహద్దుల నుండి వచ్చే సవాళ్లను ఎదుర్కొంటుంది. చుట్టూ శత్రు దేశాల సరిహద్దులు ఉండటంతో అక్కడి వారు రాకుండా, తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా దేశ అంతర్గత  భద్రతకు ముప్పు ఏర్పడకుండా ఈ ప్రత్యేక దళం పని చేస్తుంది. సరిహద్దుల్లో శాంతిభద్రతల పర్యవేక్షణ మగావ్ దళం ముఖ్య విధి అని చెప్పాలి.
ఇజ్రాయెల్ పోలీస్ ఫోర్స్
ఇది మన పోలీసుల్లానే దేశ వ్యాప్తంగా ఆ దేశ చట్టాలు అమలు, నేరాల నియంత్రణ, క్రిమినల్స్ ను పట్టుకుని న్యాయస్థానాల ముందు నిలబెట్టి శిక్షలు పడేలా చేయడం వీరి ప్రధాన విధి. ప్రజల రక్షణ అనేది  ఇజ్రాయెల్ పోలీసుల ప్రధాన విధి.
సరిహద్దు భద్రత దళాలు
 ఈ దళాలు ముఖ్యంగా వివాదస్పద సరిహద్దు ప్రాంతంలో గస్తీ కాస్తుంటాయి. మనకు పాకిస్థాన్, బంగ్లా సరిహద్దుల్లో ఎలా ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయో.. అలాగే సిరియా, లెబనాన్, పాలస్తీనా సరిహద్దుల్లో ఇవి పని చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత సున్నితమైన ప్రాంతాలు, ఉద్రిక్త పరిస్థిలు ఉండే గాజాస్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ ఏరియాల్లో ఈ దళాలు కీలక పాత్ర పోషిస్తాయి.
 ఇక ఆ దేశంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అత్యంత శక్తవంతమైన ప్రత్యేక కార్యాచరణ దళం. మొస్సాద్.
మొస్సాద్ –   ఇజ్రాయెల్ దళాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మొస్సాద్ కోసమే. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన గూడాఛార దళం మొస్సాద్. మనకు రా అంటే రిసెర్ట్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) ఎలానో.. మొస్సాద్ ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ. దేశంలోపల, వెలుపల ఎన్నో  ఆపరేషన్లు నిర్వహించి సక్సెస్ ఫుల్ గూఢాచార సంస్థగా ప్రపంచంలో గుర్తింపు పొందింది. మొస్సాద్ ప్రధాన విధి విదేశాల్లో గూఢచార్యం నిర్వహించడం. ఇజ్రాయెల్ కు ముప్పుగా పరిమణించే దేశాలను, వ్యక్తులను, సంస్థలను, తీవ్రవాద సంస్థలను, ఆర్థిక సంస్థలను, సాంకేతిక సంస్థలను టార్గెట్ చేస్తూ పని చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో మొస్సాద్ ఏజెంట్లు పని చేస్తారు. దేశ భధ్రతే వీరి ప్రధాన విధిగా చెప్పాలి.

ఇలా  అంతర్గత భద్రత విషయంలో ఇజ్రాయెల్ ఎంత మాత్రం రాజీ పడని దేశంగా పేరు పొందింది. తమ దేశానికి, దేశ వాసులకు  ఏదైనా ముప్పు వాటిల్లుతుందని సమాచారం వస్తే  ఖండాలు దాటైనా వారి భద్రతా దళాలు స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించి ఆ ముప్పును కలిగించే సంస్థలను న్యూట్రలైజ్ చేస్తాయి. వ్యక్తులైతే మట్టుపెడతాయి. అందుకే ఇజ్రాయెల్ దళాలంటే ప్రపంచంలోని రక్షణ దళాల్లో ప్రత్యేకమైన దళాలుగా గుర్తింపు పొందాయనడంలో సందేహం లేదు. అసాధ్యమైన, సాహసోపేతమైన ఆపరేషన్లు నిర్వహించిన ఘనత వీరి సొంతం. హాలివుడ్ సినిమాలను తలపించే  మిలటరీ ఆపరేషన్లు చేసిన చరిత్ర ఇజ్రాయెల్ దళాలది.