తెలంగాణ రాజకీయం

బుచ్చమ్మది ఆత్మహత్య కాదు..రేవంత్ రెడ్డి ప్రభుత్వం హత్య

తెలంగాణ ప్రజలను ఏడిపించి, వారి కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఒక శాడిస్ట్ లాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషపడుతున్నారు.. నిజం రాజు లాగా వ్యవహరిస్తున్నారని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ తీవ్ర స్థాయి లో విమర్శించారు. బుచ్చమ్మ మృతదేహం వద్ద ఈటల రాజేందర్, బీజేపీ నాయకులు రవి కుమార్ యాదవ్, మల్లారెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, వడ్డేపల్లి రాజేశ్వర్ రావు లతో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని చూస్తే సంజయ్ గాంధీ గుర్తువస్తున్నారు. ఢిల్లీలో వేలాది మంది పేదల ఇళ్లను కూల్చివేసి మారుతి కంపెనీకి ఆ భూమిని కట్టబెట్టారన్నారు. హైడ్రా అధికారులు మేం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు.. నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు.. మేమే సుప్రీం.. మాకు రేవంత్ రెడ్డి అండగా ఉన్నాడు అని అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. బాదితులకు భారతీయ జనతా పార్టీ పేదలకు అండగా ఉంటుందని ఎంపీ ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.

హైడ్రా అధికారులు వందల మంది పోలీసులతో వచ్చి అనేకమంది ఇళ్లను షెడ్లను కూల్చివేశారు.  వారిని పరామర్శించేందుకు నేను వచ్చినప్పుడు శివయ్య సాయిలు కలిశారు. సాయిలు అన్న కొడుకు మహేందర్.. మేము ఈ భూమిని కొనుక్కున్నాము అనేక సంవత్సరాలుగా ఉంటున్నాము. మా పట్టా భూమి మీదకు వచ్చి షెడ్లు కూలగొట్టే అధికారం వీరికి ఎవరు ఇచ్చారని కన్నీరు మున్నిరయ్యారు. కాపాడాలని మొరపెట్టుకున్నారు. సాయిలు ఆయన భార్య బుచ్చమ్మ ఉన్న భూమిని కూతుర్లకు కట్నం కింద ఇచ్చారు. ఆ భూమి మాకు రాదా అని బిడ్డలు అడగడంతో బావురుమని ఆత్మహత్య చేసుకుంది. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వ హత్య చేసింది.

ఇది ముమ్మాటికి సర్కారు హత్య అన్నారు. మొన్న కూడా ఒక ఆమె గుండె ఆగి చనిపోయిందని, హైదరాబాదులో చెరువుల పక్కన ఉన్నవాళ్లు, ప్రభుత్వము పట్టాలు ఇస్తే ఇల్లు కట్టుకున్న పేదవారు కంటిమీద కునుకులేకుండా బ్రతుకుతున్నారన్నారు.శనివారం, ఆదివారం వచ్చిందంటే పొయ్యి మీద కుండ పెట్టకుండా దిగాలు పడి బ్రతుకుతున్నారని ఈటెల ఆవేదన వ్యక్తం చేసారు.మూసి ప్రక్షాళన పేరుతో కూడా చైతన్యపురిలో 50 అడుగుల ఎత్తు పైన ఉన్న ఇళ్లను ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చారు. ఐదు కోట్లు ఉన్న ఇల్లుకు 5 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి పోలీసులు రెవెన్యూ అధికారులు హింస పెడుతున్నారని దుయ్యబట్టారు.
గత 45 రోజులుగా నల్లచెరువు, అస్మత్పేట చెరువు, కూకట్పల్లి చెరువు, బోరబండ చెరువు, పిర్జాదిగూడ చెరువు అనేక చర్లలో వందల ఇళ్లను కూల్చివేసి హైడ్రా అధికారులు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు.. నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు.. మేమే సుప్రీం.. మాకు రేవంత్ రెడ్డి అండగా ఉన్నాడు అని అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు.తెలంగాణ ప్రజలను ఏడిపించి వారి కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఒక శాడిస్ట్ లాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషపడుతున్నారు.నిజాం రాజులాగా వ్యవహరిస్తున్నారు.అనేక ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు.. అనేక ప్రభుత్వాలను చూసాం కానీ ఇలాంటి ప్రజల దుఃఖాన్ని చూసి సంతోషి పడే ముఖ్యమంత్రి కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే.6 నెలల కాలంలోనే అనేక రకాల తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రజలను వేధిస్తున్నారు. కేర్ఫుల్ గా ఉండండి మీ అధికారం ఐదేళ్ల కోసమే.. శాశ్వతంగా కాదు. తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్నారు మూల్యం చెల్లించక తప్పదు. రేవంత్ రెడ్డిని చూస్తే సంజయ్ గాంధీ గుర్తుకువస్తున్నారు. ఢిల్లీలో టర్క్ మెన్ గేటు దగ్గర వేలాదిమంది పేదల ఇళ్లను కూల్చివేసి సంజయ్ గాంధీ మారుతి కంపెనీకి ఆ భూమిని కట్టబెట్టారు.

వేలాదిమంది పేదల ఇళ్లను కూల్చివేసి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. మూసి ప్రక్షాళన అంటే వరదలు రాకుండా, మురికి లేకుండా చేస్తారనుకున్నాం. కానీ 50 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్లను రివర్ బెడ్ పేరు చెప్పి ఇండికేట్ చేయడం దుర్మార్గ మని విమర్శించారు.రేవంత్ రెడ్డి  గారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దమ్ము లేక ప్రజలను పక్కదో పట్టించేందుకు, వేలకోట్ల రూపాయలు సంపాదించుకునే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తున్నారు. పర్యావరణవేత్తలారా చెరువులను చెరువులను కాపాడుతామని చెప్తున్న మేధావులారా ఆలోచన చేయండి.భారతీయ జనతా పార్టీకి పేదలకు అండగా ఉంటుంది.ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తుందన్నారు. ప్రజలారా భయపడకండి మీ వెంట మేము ఉంటాము. బుచ్చమ్మది చావుకు కారణం రేవంత్ రెడ్డి సర్కార్.ఇది సర్కారు హత్య మాత్రమే తెలియజేస్తున్నామని ఈటల రాజేందర్ అన్నారు.