హిందువుల దైవం శ్రీ తిరుపతి తిరుమల వెంకన్న స్వామి వారి ప్రసాదమైన లడ్డును జంతువుల కొవ్వు నెయ్యి రూపంలో లడ్డుకు కలిపారని వస్తున్న అపోవలు నిజం కాదని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మోసపూరిత మాటలు లడ్డుపై చెప్పి నీచ రాజకీయం చేయకూడదని ఆపవిత్రమైన మాటలను తొలగించడానికి జగన్మోహన్ రెడ్డి 28 వ శనివారం ప్రతి గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలి అన్నారు. ఈ సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి, ఆదేశాల మేరకు కౌతాళం గ్రామంలో మండల నాయకులు ప్రహ్లాద చారి, పిఏ వెంకటరామిరెడ్డి, సర్పంచ్ పాల్ దినకర్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజా కార్యక్రమం అనంతరం గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ హిందువులకు ప్రత్యేక దైవం శ్రీ తిరుమల వెంకన్న స్వామి వారి లడ్డుపై నీచ రాజకీయం మానుకొని దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డిని ఎదురుగా ఢీకొని విధంగా రాజకీయం చేయాలని హిందువుల పవిత్రమైన దేవాలయం తిరుమల తిరుపతి వెంకన్న స్వామి వారి ప్రసాదం పై ఇలాంటి నీచ రాజకీయాలు మానుకొని హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుపతి వెంకన్న స్వామి వారికి కోట్లల్లో ప్రపంచమంతట భక్తులు వచ్చి దర్శించుకున్న సమయంలో లడ్డుపై ఇలాంటి రాజకీయం చేసి భక్తులకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు తెలపాలని గ్రామ నాయకులు డిమాండ్ చేశారు.
లడ్డుపై నీచ రాజకీయం చేయకుండా ఇచ్చిన హామీలపై దృష్టి ఉంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు బాటలు వేయకుండా ఇలాంటి రాజకీయం చేయకూడదని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.