మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరాలని పట్టుదలగా ఉన్న రేవంత్ రెడ్డి అందుకు వస్తున్న అడ్డంకులను అధిగమించడానికి నల్లగొండ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీశారు. సికింద్రాబాద్‌లో ఫ్యామిలీ డిజిటర్ కార్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మూసీ నది ప్రక్షాళన విషయంలో ఉద్యమం చేస్తున్న వారిపై మండిపడ్డారు. రాజకీయాల లోతు తెలియక కాదని.. కానీ తాము కోసం ప్రయత్నిస్తున్నామని చెబుతుతున్నారు. ఇదే సమయంలో ఆయన నల్లగొండ అంశాన్ని తెరపైకి తీసుకు రావడం ద్వారా తన రాజకీయానికీ చాలా లోతు ఉందని ఆయన చెప్పకనే చెప్పారు. హైదరాబాద్‌లో మూసీని మురికాలువగానే ఉంచి.. నల్లగొండ ప్రజలు శాశ్వతంగా విషం తాగాలా అని రేవంత్ రెడ్డి విపక్ష నేతలను ప్రశ్నించారు. మూసి సుందరీకరణను అడ్డుకుంటే ఊరుకునేది లేదని కోమటిరెడ్డి కూడా రెండు రోజుల కిందట ప్రకటించారు.
వ్యూహాత్మకంగా నల్లగొండ అంశాన్ని తెరపైకి తెచ్చారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. మూసీ నది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రవహిస్త్తుంది. ఒక్కో సారి హైదరాబాద్ లో కురిసిన వర్షాలతో మూసి నది నల్లగండలో పొంగిపొర్లుతుంది. అక్కడ తాగు, నీటి అవసరాలకు మూసీ నది నీటిని ఉపయోగిస్తారు. అందుకే రేవంత్ ప్రత్యేకంగా నల్లగొండ అంశాన్ని తెరపైకి తెచ్చారు. మూసి నదీ సుందరీకరణను అడ్డుకుంటామని ఆక్రమణలు తొలగిస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఉద్యమం చేస్తున్నారు. కేటీఆర్ మూసి నది రివర్ బెడ్‌లో ఇల్లు నిర్మించుకున్న వారిని పరామర్శించారు. మీ కోసం రోడ్డెక్కుతామని పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ తరపున ఈటల , కిషన్ రెడ్డి కూడా మూసీలో ఆక్రమణల కూల్చివేత అంశాన్ని వ్యతిరేకించారు. మీ ఇళ్లకు తాము అడ్డంగా ఉంటాని భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వీరి రాజకీయానికి నల్లగొండ నుంచి చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయానికి వచ్చారు.
మూసీ సుందరీకరణ చేయకపోతే నల్లగొండ ప్రజలు విషం తాగాల్సి వస్తుందని రేవంత్ నేరుగా చెప్పడంతో ఇతర పార్టీలకు ఇబ్బందికర పరిస్థితి ఎదురయింది. రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఈటల రాజేందర్ చెప్పారు. మూసీ సుందరీకరణ చేపట్టవద్దని తాము చెప్పలేదని.. చేపట్టాలన్నారు. నల్లగొండ ప్రజలు.. రేవంత్ రెడ్డి చెప్పే మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లా రాజకీయంగా అత్యంత కీలకం. అక్కడి ప్రజల్ని కాదనుకుంటే.. అధికారంలోకి రావడం సాధ్యం కాదు. అందుకే రేవంత్ మాటలను నమ్మవద్దంటూ.. ఈటల దారికొచ్చేశారని.. బీఆర్ఎస్ కూడా రాక తప్పదని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.