గాంధీ జయంతి రోజున కొండా సురేఖ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం ఓ వైపు సాగుతున్న సమయంలో మరో వైపు తెలంగాణ ప్రభుత్వంలోని నెంబర్ టు నాయకుడు హైదరాబాద్‌లని ఓ స్టార్ హోటల్‌లో అదానీని కలిశారని కేటీఆర్ ఆరోపించారు. భేటీలో ప్రభుత్వంలోని నెంబర్ టు నాయకుడితో పాటు రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ఉన్నారన్నారు. అసలు వీరిమధ్య జరిగిన చర్చలేంటి.. జరిగిన ఒప్పందాలేమిటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో మాట్లాడిన కేఏ పాల్ కూడా ఇలాంటి ఆరోపమలు చేశారు. కేటీఆర్ తన ట్వీట్‌లో ఆ నెంబర్ టు ఎవరో చెప్పలేదు కానీ.. కేఏ పాల్ మాత్రం చెప్పేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదానీని హోటల్లో ఎందుకు కలిశాడు.. అందులో సునీల్ కొనుగోలు ఎందుకు ఉన్నాడోచెప్పాలన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక పెద్ద అవినీతి పరుడు.. అందరికి టోపీలు పెడుతుంటాడని ఆరోపించారు. వీళ్లకు ఓట్లు వేయడానికి ప్రజలకు కూడా బుద్ధి లేని ప్రజల్ని కూడా విమర్శించారు.
అదానీతో పొంగులేటి , సునీల్ కనుగోలు భేటీ అయినట్లుగా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరో వైపు పొంగులేటి కానీ అదానీ గ్రూప్ కానీ ఈ సమావేశంపై స్పందించలేదు. దీంతో అసలు సమావేశం జరిగిందా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ఆదానీ గ్రూపును బీజేపీ సన్నిహిత కంపెనీగా కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉంటారు. జాతీయ స్థాయిలో కూడా అదానీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో అదానీతో.. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు సమావశం అయ్యారని బయటకు రావడం కలకలం రేపేదే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించడం వెనుక సునీల్ కనుగోలు వ్యూహాలు ఎక్కువగా ఉన్నాయని నమ్ముతారు. కనుగోలు కూడా ఈ సమావేశంలో పాల్గొనడంతో రాజకీయ అంశాలపై చర్చ జరిగిదని భావిస్తున్నారు. అలాగే తెలంగాణలో ఏదైనా భారీ ప్రాజెక్టు అదానీ చేతికి వెళ్తుందా అన్నదానిపై చర్చ జరుగుతోంది. మొత్తంగా అదానీతో భేటీపై పొంగులేటి శ్రీనివసరెడ్డి ఓ ప్రకటన చేస్తే క్లారిటీ వచ్చే అవకాశ ఉంది.