తెలంగాణ రాజకీయం

రేవంత్ కు కేవీపీ లేఖ

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కేవీపీ ఫామ్ హౌస్ ను కూల్చొద్దా అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇతర నేతల గురించి రేవంత్ చెప్పినా… కేవీపీ  మాత్రం  స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేత. దీంతో ఆయన ఆవేదనా పూర్వకంగా స్పందించారు. తన వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు రావడం ఇష్టం లేదని .. తమ ఫామ్ హౌస్ అక్రమం అయితే కూల్చివేయాలని ఆయన లేఖలో కోరారు. తనది కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘమైన అనుబంధం ఉందన్నారు. ఇందిరా గాంధీ  హయాంలోనే తాను 33 ఏళ్ల వయసులో గాంధీభవన్ ఇంచార్జ్ గాపని  చేశానని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకు రావడంతో పాటు .. రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా కూడా పని చేశానని లేఖలో రేవంత్‌కు కేవీపీ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని స్వాగతిస్తానన్నారు. తన గురించి ఈ రోజు ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి చెప్పవలసి రావడం బాధాకరమని చెప్పుకొచ్చారు.

వైఎస్ హయాంలోనే మూసీ ప్రక్షాళన చేపట్టాలనుకున్నారని  2005లో రూ. 908 కోట్లతో సేవ్ మూసీ అనే ఓ పథకాన్ని కూడా వైఎస్ ప్రారంభించారన్నారు. అయితే ఇతర అభివృద్ది పనులకు ఎక్కువ నిధులు అవసరం కావడం.. మూసి ప్రక్షాళనకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉండంటతో ఆ పనులను అప్పటి వైఎస్ ప్రభుత్వం కొనసాగించలేకపోయిందన్నారు. తాను నల్లగొండ జిల్లా నేరేడు చర్ల మున్సిపాలిటిలో ఓటరుగా నమోదు చేసుకున్నానని మూసీ కాలుష్యం వల్ల అక్కడి వారు పడుతున్న బాధలు చూసి.. మూసి ప్రక్షాళన చేయలేకపోవడంపై బాధపడ్డానన్నారు.
అజీజ్ నగర్‌లో తన కుటుంబసభ్యులపై ఉన్న  ఫామ్ హౌస్ విషయంలో విపక్షాలు తనను ఓ పావుగా వాడుకోడవడ బాధ కలిగిస్తోదంన్నరు. ఈ విషయం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తనకు బాధ కలిగిస్తోందన్నారు. అందుకే అధికారుల్నితన ఫామ్ హౌస్ కు పంపించి… అక్రమాలు ఉంటే మార్క్ చేస్తే.. తన సొంత ఖర్చుతో కూల్చివేస్తానని లేఖలో పేర్కొన్నారు. తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయిపులు వద్దన్నారు. కేవీపీ లేఖతో తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోన్న ఆసక్తి ఏర్పడుతోంది.