జాతీయం

16 నుంచి భక్తులకు పూరీ జగన్నాథుడి దర్శనం

ఈ నెల 16 నుంచి ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో భక్తులకు అనుమతివ్వనున్నారు. వీకెండ్‌ లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో భక్తులకు దర్శనాలకు అనుమతి నిలిపివేశారు. 16 నుంచి స్థానిక భక్తులకు మాత్రమే ఆలయ ప్రవేశానికి అనుమతి ఇవ్వగా.. ఈ నెల 23 నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చే వారికి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే, జగన్నాథుడి దర్శనానికి వచ్చే భక్తులు మాత్రం తప్పనిసరిగా 96 రోజులకు మించి దాటకుండా.. తీసుకున్న ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ రిప్టోర్‌ సమర్పించాలని, రెండు డోసులు టీకా తీసుకున్న వారికి మాత్రమే ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు.