ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

డిసెంబర్ లో విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన

విశాఖ రైల్వే జోన్ కు గత ప్రభుత్వం భూమి ఇవ్వకుండా కాలయాపన చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే రైల్వే జోన్ కు భూమిని కేటాయించాం. డిసెంబర్ లో విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తాం. విశాఖ రైల్వే జోన్ లోనే వాల్తేరు రైల్వే డివిజన్ ఉంటుంది.  జఠిలమైన సమస్యను పరిష్కరించామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
హౌరా నుండి చెన్నై రెండు రైల్వే లేన్లను 4 లేన్లగా మార్చుతున్నారు. దీంతో గూడ్స్, రైళ్ల రాకపోకలు పెరుగుతాయి. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ప్రతి పట్టణం అనుసంధానం అవుతుంది. తద్వారా ఏకకాలంలో ఎకనమిక్, పోర్టు డెవలెప్మెంట్ తో పాటు పెరగనున్న ఉపాధి అవకాశాలు. విజయవాడ నుంచి అమరావతి లైన్ కు కేంద్రం అంగీకరించింది.   మచిలీపట్నం నుంచి రేపల్లె రైల్వే లైనుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.  బుల్లెట్ ట్రైన్ ద్వారా అమరావతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పట్టణాల అనుసంధానం చేయాలి కోరాం. దేశం లోని కీలకమైన ఎకనమిక్ హబ్ ల గుండా బులెట్ ట్రైన్ ప్రయాణం జరుగుతుంది. బులెట్ ట్రైన్ అనుసంధానంతో పెరగనున్న ఎకానమీ ఆక్టివిటీస్ పెరుగుతాయి.2026 నుండి బులెట్ ట్రైన్ పనులు ప్రారంభం అవుతాయని అభిప్రాయపడుతున్నా. రాష్ట్రంలోని ప్రతీ రైల్వే స్టేషన్ ను ఆధునీకరణ పూర్తి చేయాలని కోరాం నడికుడి టూ శ్రీకాళహస్తి, కోటపల్లి టూ నర్సాపూర్, కడప టూ బెంగళూరు లైన్ల కోసం మ్యాచింగ్ గ్రాంట్ అడుగుతున్నారని అన్నారు.
ఇప్పటికే రూ.75 వేల కోట్ల రైల్వే పనులు రాష్ట్రంలో జరుగుతున్నాం.   నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఏపీలో పెట్టేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది.  దీంతో సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీకి డిమాండ్ పెరుగుతుంది. దీనిపై పైనా వర్కవుట్ చేయాలి. లాభనష్టాలు బేరీజు వేసుకుని ముందుకెళ్తాం.  ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీకి ఏపీని కేరాఫ్ అడ్రెస్ గా నిలిపి, తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరగుతుంది. డేటా సెంటర్ భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పలు ప్రతిపాదనలు పంపాం. ఏపీలో దీనికి సంబంధించిన వ్యవస్థను రూపొందిస్తాం.  ఏఐని సమగ్రంగా వినియోగించి సత్వర పాలనలో సత్వర ఫలితాలు సాధిస్తాం.  ఏపీలో ఈనెల 22, 23 తేదీల్లో డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తాం.  గతంలో ఐటీని ప్రోత్సహించించిన విధంగా నేడు కృత్రిమ మేథను ప్రోత్సహిస్తామని అన్నారు.
ఏపీ జీఎస్టీ వదులుకోవడంతో పాటు ప్రభుత్వ స్థలాలు ఇవ్వడానికి సిద్దమని తెలిపాం. 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కోరాం. గత ప్రభుత్వం అనంతపురం, అమరావతి హైవేను అమరావతి కడపకు మార్చింది. కొత్తవలసలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే సాలూరుకు మార్చారు. సముద్ర తీరం వెంట 22 వేల ఎకరాలు సాల్ట్ ల్యాండ్ ఉంది…దాన్ని కూడా అప్పగిస్తే ఇండస్ట్రియల్ కు ఉపయోగించుకోవచ్చని కోరాం.  గత ప్రభుత్వం చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో చేయదని అన్నారు. విశాఖ ఉక్కుపై కుమారస్వామితో చర్చించాం.  ప్రత్యామ్నాయ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం.  రూ. 15 వందల కోట్లు ఇప్పటిదాకా నిధులు కేటాయించారు.   ఇబ్బందులను అధిగమించుకుని ముందుకు వెళ్లాలని చూస్తున్నాం. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. కొంత యాజమాన్య నిర్ణాయాల కారణంగా విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో పడింది. సెయిల్ లో విలీనం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తాం.  తాత్కాలిక నిధులతో సమస్య పరిష్కారం కాదు. ప్రైవేటైజేషన్ కాకుండా చేసేందుకు ఉన్న  అవకాశాలను పరిశీలిస్తున్నాం.  గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులను సరిగా వినియోగించలేదు.  కుళాయి ద్వారా నీళ్లందించే అవకాశాన్ని ఉపయోగించలేదు.

•ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి గత ప్రభుత్వం ఇష్టారీతిన అప్పులు చేసింది. రూ. 10 లక్షల కోట్లకు పైగా అప్పుల భారాన్ని గత ప్రభుత్వం చేసింది. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసమే కేంద్రంతో పదేపదే మాట్లాడతున్నాం. ఏపీలో జాతీయ రహదారులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. చిన్నపాటి భూ సమస్యలు కూడా పరిష్కరించలేదు. రైల్వే లైన్ల గురించి, అండర్ పాస్ లు, స్టేషన్ల ఆధునీకరణ గురించి పట్టించుకోలేదు. కనీసం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయి. కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఖర్చు పెట్టిన వాటికి కనీసం గత ప్రభుత్వం యూసీలు ఇవ్వలేదని అన్నారు.